ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నా, కరోనా వ్యాప్తికి బ్రేక్ మాత్రం పడడంలేదు. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, డాక్టర్లు విరామం లేకుండా నిరంతరం కరోనా పై పోరు సాగిస్తున్నా, కరోనా కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇటీవల ప్రజా ప్రతినిధులలో కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా వైసీపీ ఎమ్మెల్యేకి కరోనా సోకిందని వార్తలు వస్తున్నాయి.
అసలు మ్యాటర్‌లోకి వెళితే.. నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యకు తాజాగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. సంజీవయ్యకు అనారోగ్యంగా ఉండడంతో, కరోనా పరీక్ష చేయించగా, ఆయనకు పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే ఆయన్ని చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం అక్కడి డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న సంజీవయ్యకు కరోనా లక్షణాలు తక్కువుగానే ఉన్నాయని, ఆందోళణ చెందల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే వర్గీయులు వెళ్ళడించినట్లు సమచారం.