బాలయ్య, నాగబాబుల మాటలు రెండు యుద్దాలకు తెర తీశాయి 

 
బాలయ్య, నాగబాబుల మాటలు రెండు యుద్దాలకు తెర తీశాయి 
 
గత రెండు రోజులుగా జనసేన నేత నాగబాబు పలు అంశాల మీద తీవ్ర స్థాయిలో మాట్లాడుతూ వస్తున్నారు.  మొదట సినిమా పెద్దల మీటింగ్ గురించి బాలయ్య చేసిన వ్యాఖ్యలపై స్పందించిన నాగబాబు నోరు అదుపులో పెట్టుకుని మట్లాడాలని, ముందు క్షమాపణ చెప్పాలని, అసలు ఏపీని రియల్ ఎస్టేట్ పేరుతో దోచుకుంది టీడీపీ అంటూ సంచలనం రేపారు.  దీంతో రెండు చోట్ల కొత్త వార్ మొదలైంది.  ఒకటి ఇండస్ట్రీలో మెగా వెర్సెస్ నందమూరి అనేలా ఫైట్ స్టార్టయింది.  ఇండస్ట్రీలో ఈ ఫైట్ కొత్తదేమీ కాకపోయినా కొన్నాళ్ళుగా స్తబ్ధుగానే ఉంది.  
 
కానీ ఉన్నట్టుండి బాలయ్య అలా మాట్లాడటం, సమావేశంలో చిరు ఉండటం, నాగబాబు గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో రెండు అభిమాన వర్గాలు మాటల యుద్దం స్టార్ట్ చేశాయి.  బాలయ్య ఫ్యాన్స్ బాలయ్య ఆవేదనలో తప్పేముంది, సమావేశానికి పిలవాలి కదా, అసలు బాలయ్య లేకుండా ఇండస్ట్రీ ఏమిటి అంటే మెగా అభిమానులు మాత్రం పిలవకపోతే భూములు పంచుకున్నారంటూ బూతులు మాట్లాడతారా, నాగబాబు సరైన సమాధానమే ఇచ్చారని వాదనకు దిగుతున్నారు. 
 
ఇక రాజకీయంగా కూడా వీరి వ్యాఖ్యలు జనసేన, టీడీపీల మధ్య చిచ్చు పెట్టాయి.  ఇప్పటికే జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో బాహాటంగానే తేదేపా మీద విసుర్లు విసురుతూ ఉంటారు.  ఈ సంఘటనతో ఏపీని రియల్ ఎస్టేట్ పేరుతో దోచుకుంది టీడీపీ కాదా అంటుంటే టీడీపీ శ్రేణులు హోదా ఇవ్వని భాజాపాతో పవన్ దోస్తీ ఏమిటని ప్రశ్నిస్తున్నారు.  తాజాగా కూడా నాగబాబు నెక్స్ట్ అధికారం జనసేన, వైసీపీ, భాజాపాలలో ఎవరిదో కాలమే చెబుతుంది.. కానీ టీడీపీ మాత్రం అధికారంలోకి రాదని బల్లగుద్ది చెబుతాను.  ఎందుకంటే సాండ్ మాఫియా, కాల్ మనీ, కరప్షన్ ఇలా వారు చేసిన అవినీతి చిట్టా చాలా పెద్దది అంటూ మరోసారి విరుచుకుపడ్డారు.  ఇవి నిప్పుకు గాలి తోడైన చందంగా వివాదాన్ని ఇంకాస్త పెంచుతున్నాయి.