పచ్చ మీడియా వికృతం.. పవన్ టీడీపీకి మద్దతట 

అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిల అరెస్టుల విషయంలో టీడీపీ ఎంత రగడ చేస్తోందో అందరికీ తెలుసు.  అచ్చెన్నాయుడు మీద అవినీతి ఆరోపణలు చేస్తే ఏదో మొత్తం బీసీ కులానికి అవినీతి అంటగట్టినట్టు నానా యాగీ చేస్తున్నారు.  ప్రజెంట్ తమని తాము కాపాడుకోవడానికి వారికి కనిపిస్తున్న ఒకే ఒక ఆయుధం కుల రాజకీయం.  ఇక వారికి అనుకూలంగా ఉండే ఆ రెండు న్యూస్ ఛానెళ్ళు అయితే అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడానికి కనిపించిన ప్రతి దారినీ వాడేస్తున్నారు.  ఈ ప్రయత్నంలో దిగజారుడు ప్రయత్నాలు కూడా ఉన్నాయి. 
 
వాటిలో ఒకటి పవన్ కళ్యాణ్ ను వివాదంలోకి లాగడం.  నిన్న జనసేన పార్టీ తరపున ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ అరెస్టులు అవినీతికి పాల్పడినందుకా లేకపోతే కక్ష సాధింపు చర్యలా అనే విషయంలో వైసీపీ ప్రభుత్వం తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.  అలాగే అవినీతికి పాల్పడినవారు వారు ఎవరైనా వారిని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.  అచ్చెన్నాయుడు అరెస్టులో నియమ నిబంధనలు లోపించినట్టుగా ఉంది.  ఈఎస్ఐలో జరిగిన అన్ని అక్రమాలపై విచారణ చేపట్టాలి అన్నారు. 
 
ఈ స్టెట్మెంట్లో ఎక్కడైనా ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ, టీడీపీకి అనుకూలంగా మాట్లాడినట్టు అస్సలు లేదు.  కానీ ఎల్లో మీడియా మాత్రం ప్రెస్ నోట్ నేరుగా పవన్ నుండే వచ్చిందని ప్రచారం చేసింది.  పరోక్షంగా పవన్ ప్రభుత్వ చర్యలను ఖండించినట్టు వార్తలు వదిలారు.  ఇక సోషల్ మీడియాలో అయితే టీడీపీకి పవన్ మద్దతు అన్నట్టు చర్చ జరిగింది.  అధికార పార్టీ సోషల్ మీడియా మద్దతుదారులు కూడా వ్యవహారంలోకి దూరి పవన్, చంద్రబాబుల మధ్య రహస్య ఒప్పందం ఇంకా ఉందని, అందుకు నిదర్శనమే ఈ స్టెట్మెంట్లని వాదనకు దిగారు.  మొత్తానికి వివాదంలోకి జనసేనను లాగాని గట్టిగానే ప్రయత్నాలు జరిగాయి.