దేవిక మృతి విషయంలో మీడియా ఛానెళ్లను ఏకిపారేస్తున్న నెటిజన్లు 

ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూపిస్తూ పెద్దది చేసే మీడియా కొన్ని విషయాలను మాత్రం అస్సలు పట్టించుకోదు.  గత బుధవారం భద్రాది జిల్లా కొత్తగూడెంకు చెందిన 17 ఏళ్ల యువతి రైల్వే ట్రాక్ మీద అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.  కాగా ఆ యువతి పేరు దేవిక అని, కొత్తగూడెంకు చెందిన అశోక్ కుమార్ మూడవ కుమార్తె అని పోలీసుల విచారణలో తేలింది.  దేవిక మృతి పట్ల ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  ఆమెను ఎవరో అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపిస్తున్నారు.  పోస్టుమార్టంలో కూడా సరైన వివరాలు రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు రీపోస్టుమార్టం చేయాలని డిమాండ్ చేశారు. 
 
దేవిక మంగళవారం అర్థరాత్రి ఇంటి నుండి కనిపించకుండా పోవడం, ఆ మరుసటిరోజు ఉదయమే రైల్వే ట్రాక్ మీద శవమై కనిపించిన తీరు చూస్తే మృతి వెనుక పెద్ద మిస్టరీ దాగుందని అర్థమవుతూంనే ఉంది.  కానీ ప్రముఖ మీడియా ఛానెళ్లు ఏవీ దేవిక అనుమానాస్పద మృతి పట్ల పెద్దగా స్పందించలేదు.  కనీసం మినిమమ్ కవరేజ్ కూడా లేదు.  చిన్న చిన్న విషయాలని డిబెట్లు పెట్టి మరీ పెద్దవిగా చూపే బడా ఛానెళ్లు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జనంలో పలు అనుమానాలకు తావిచ్చింది. 
 
కావాలనే దేవిక మృతి విషయాన్ని తొక్కిపెడుతున్నారని నెటిజన్లు సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ దేవిక అంటూ పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు.  పెద్ద ఛానెళ్ళు అనే పేరుతో చలామణీ అవుతన్న సదరు ఛానెళ్లు నిజంగా దమ్మున్న ఛానెళ్లే అయితే నిజాయితీగా పనిచేసేవే అయితే వెంటనే దేవికకు న్యాయం జరిగేలా పనిచేయాలని డిమాండ్ చేశారు.  ఇక విషయం తీవ్రంగా మారుతుండటంతో  స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పందించారు.  తాను దేవిక తల్లితో, సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజుతో మాట్లాడానని, వారికి న్యాయం కల్పించేలా చర్యలు తీసుకుంటానని అన్నారు.  ఫాస్ట్‌ట్రాక్ ద్వారా దర్యాప్తు జరిపించేలా ఆదేశాలను జారీ చేసినట్లు చెప్పారు.  ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు.