తెలంగాణలో కరోనా కట్టడి..ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల వైఫల్యాల నేపథ్యంలో సీన్ లో కి రాష్ర్ట గవర్నర్ తమిళసై రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. కేసీఆర్ కొన్ని రోజుల పాటు ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడం కూడా గవర్నర్ ఎంట్రీకి కారణమైంది. గవర్నర్ రాకతో హుటాహుటిన ప్రయివేటు ఆసుపత్రలో యాజమాన్యంతో వీడియో కాన్పర్స్ తో ద్వారా సమావేశమై పరిస్థితితులను చక్కదిద్దారు. అధికంగా వసూళ్లకు పాల్పడుతోన్న ఆసుపత్రులపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కొవిడ్ చికిత్స అందించాలని రాష్ర్ట ప్రథమ పౌరురాలిగా ఆదేశాలిచ్చారు.
ఈనేపథ్యంలో పాలన ముఖ్యమంత్రి నుంచి గవర్నర్ చేతుల్లోకి వెళ్తుందా? రాష్ర్టంలో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అటు ప్రతిపక్షం నుంచి రాష్ర్ట పతి పాలన విధించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వ్యక్తం అయ్యాయి. ఇక గవర్నర్ ఎంట్రీ ఇచ్చిన రెండు, మూడు రోజులకే సీఎం కేసీఆర్ కూడా ప్రగతి భవన్ లో ప్రత్యక్షమయ్యారు. రాష్ర్ట పరిస్థతులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈనేపథ్యంలో బుధవారం కేసీఆర్ ప్రయివేటు ఆసుపత్రల్లో కరోనా చికిత్సలు ఉచితంగా చేసేలే ఉత్తర్వలు జారీ చేయడం విశేషం. తొలుత మూడు మెడికల్ కాలీజీల్లో, ఆ తర్వాత రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న మిగతా ఆసుపత్రుల్లో వైద్యం ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని అదేశించారు.
అలాగే కరోనా పరీక్షలు కూడా అన్ని ల్యాబ్ ల్లో ఉచితంగా చేయాలని ఆదేశించారు. ఈ నిర్ణయం పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నా! నెల రోజులు ముందుగా ఈ నిర్ణయం తీసుకుని ఉంటే ఎన్నో ప్రాణాలు నిలబడేవని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే సుఖం ఏముంటుందని విపక్షాలు మండిపడుతున్నాయి. గవర్నర్ వచ్చే వరకూ కేసీఆర్ కు రాష్ర్టంలో పరిస్థితులు అర్ధం కాలేదా? అని దుయ్యబెడుతున్నాయి. ఇకనైనా ఏపీ ప్రభుత్వం తరహాలో కరోనాపై పటిష్టంగా వ్యవరించాలని సూచించాయి. క్వారంటైన్ సెంటర్లు, కొవిడ్ ఆసుపత్రులపై ప్రభుత్వం నిఘా ఏర్పాటు చేసి పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.