కేసీఆర్ కు కరోనా మీద బోర్ కొట్టిందట !

 
తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇన్నాళ్లు ఆడింది ఆట.. పాడింది పాటగా సాగింది. కానీ కేసీఆర్ కు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందని తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  కొన్ని రోజులుగా కరోనా వైరస్ మహమ్మారిని హ్యాండిల్ చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం ఫెయిల్యూర్ కనిపిస్తోందనేది వాస్తవాలు చెబుతున్న మాట.  ముఖ్యంగా గాంధీ ఆస్పత్రి  అధమ నిర్వహణ.. గాంధీ డాక్టర్ల పై దాడులతో రోడ్డెక్కిన పరిస్థితి,  పైగా  రోజురోజుకు కరోనా కేసులు పెరగడం.. చూస్తుంటే తెలంగాణలో పరిస్థితి  దిగజారుతున్నట్టు భావించక తప్పదు.
 
 గత ఎన్నికల్లో  అధికారంలోకి వచ్చింది మొదలు కేసీఆర్ అప్రతిహతంగా పాలనను సాగిస్తూ  ప్రతిపక్షం అనేది లేకుండా   తిరుగులేని నేతగా వెలుగొందుతున్నాడు.  దాంతో మీడియాకు  కూడా కేసీఆర్ పాలనను పెద్దగా వ్యతిరేకించే అవకాశం లేకుండా పోయింది.  అయినా కేసీఆర్ 24గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు అన్నింటికన్నా ఎక్కువగా తెలంగాణ ఆత్మగౌరవం వంటి వాటిని ఫోకస్ చేయడంతో ఇన్నాళ్లు వ్యతిరేకత రాలేదు. అయితే తెలంగాణలో కరోనా వైరస్ టెస్టులు చేయడం లేదని హైకోర్టులు, జాతీయ మీడియా కూడా వేలెత్తి చూపుతున్నా కేసీఆర్ మాత్రం పట్టించుకోవడం లేదు.
 
ముఖ్యంగా పాతబస్తీలో కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నా  కేసీఆర్ సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం పై విమర్శలు వస్తున్నా..   పాతబస్తీతో ఇతర ప్రాంతాలకు వైరస్ విస్తరిస్తుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నా… కేసీఆర్ సర్కార్ మాత్రం సైలెంట్ గా ఉంటుంది. కరోనా మొదలైనప్పటి నుంచి వరుసగా విలేకరుల సమావేశాలు నిర్వహించిన కేసీఆర్ కు  చివరికి కరోనా మీద బోర్ కొట్టినట్లు ఉంది.  ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా కేసీఆర్  మీడియాకు దూరంగా ఉంటున్నారు.