ఏపీలో మిలియన్ కరోనా టెస్టులు.. అందులో  నిజంగా చేసినవి ఎన్ని ?

YS Jagan should repair CBN's damages to education system 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు అధికారిక లెక్కలు బయటకి వస్తున్న సంగతి తెలిసిందే.  నిన్నటివరకు మిలియన్ కోవిడ్ పరీక్షలు చేశామని ప్రభుత్వం అధికారికంగా అనౌన్స్ చేసింది.  దీంతో దేశంలోనే పరీక్షల సంఖ్యలో ఆంధ్రా రెండవ స్థానంలో ఉందని అంతా సంభరపడ్డారు.  వైఎస్ జగన్ ఇంతలా శ్రద్ద వహించి కరోనా మీద సమర్థవంతంగా పని చేస్తున్నారని పొగిడారు.  మిలియన్ పరీక్షలకు గాను 18,697 పాజిటివ్ కేసులే తేలడంతో మన రాష్ట్రంలో పరిస్థితి చేయిదాటి పోలేదని, ఇంకా అదుపులోనే ఉందని, జాగ్రత్తలు ఇంకొన్ని రోజులు పాటిస్తే సరిపోతుందని అనుకున్నారు. 
 
 
కానీ ఉన్నట్టుండి అసలు మిలియన్ పరీక్షలు అనేది నిజమేనా, కానేకాదు, ప్రభుత్వం దొంగ లెక్కలు చెబుతోందని టీడీపీ ఆరోపణలు స్టార్ట్ చేసింది.  కానీ ప్రతిపక్షం కదా అలాగే అంటుందిలే అంటూ పెద్దగా పట్టించుకోలేదు జనం.  మన పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణలో పరీక్షల సంఖ్య పెరగకపోవడం, ప్రభుత్వ అలసత్వం వంటి వాటి గురించి మాట్లాడుకుంటూ హైదరాబాద్ వాసులు మీద జాలిని, కేసీఆర్ సర్కార్ మీద కోపాన్ని చాటారు.  కానీ ఉన్నట్టుండి టెస్టులు చేయని వారికి కూడా నెగెటివ్, పాజిటివ్ అంటూ ఫొనుకి టెస్ట్ రిజల్ట్స్ రావడంతో ఖంగుతిన్నారు. 
 
 
అనంతపురంలో ప్రభుత్వం ప్రాంతాలను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి ఆ భాగాల నుండి ర్యాండమ్ పద్దతిలో శాంపిల్స్ కలెక్ట్ చేసి పరీక్షలు చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ వైద్య శాఖ అధికారుల ద్వారా పరీక్షలు చేయించుకునేందుకు ప్రజల్ని సిద్దం చేసుకుంది.  వారిలో కొందరు సచివాలయ ఉద్యోగులు, ఇతర శాఖల ఉద్యోగులు కూడా ఉన్నారు.  వారి నుండి ఫోన్ నెంబర్ సహా, ఆధార్ నెంబర్ కూడా తీసుకున్నారు.  అయితే శాంపిల్స్ మాత్రం సేకరించలేదట.  శాంపిల్ సేకరించకుండా పరీక్షలు కుదరవు.  కానీ వారి మొబైల్ నెంబర్లకు టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి.  దీంతో ఖంగుతిన్నవారు పరీక్ష చేయకుండానే రిజల్ట్ ఎలా సాధ్యం అంటూ షాకయ్యారు.  ఈ విషయమై వీడియో ఆధారాలను పట్టుకున్న టీడీపీ జగన్ ప్రభుత్వం కరోనా పరీక్షల్లో దొంగ లెక్కలు చెబుతోందని ఆరోపణలు చేస్తోంది.