ఈ విమర్శలకు కేసీఆరే క్లారిటీ ఇవ్వాలి !

 
రైతు బంధు పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగంలో అవినీతికి తెరతీస్తున్నాడా ? లేక, తమ కులపోళ్ల కోసం ఆదాయపు మార్గాలను పెంచుతున్నాడా ?  తెలంగాణలో వరి పంట ఎక్కువగా సాగు చేస్తారని.. ఇప్పుడు అవసరాలు, డిమాండ్, సప్లై అని కహానీలు చెబుతూ  వెలమ సామాజిక దళారులకు పట్టం కట్టే ప్రయత్నం చేస్తున్నాడనే అనుమానపు పోకడలు కనిపిస్తున్న మాట వాస్తవం. అది వాస్తవం కాదు, అవాస్తవం అని నిరూపించుకోవాల్సిన బాధ్యత   కేసీఆర్ దే.          
 
అయినా,  చెప్పిన పంట వేయకుంటే రైతు బంధు ఇవ్వబోమని చెప్పడం ఏమిటి ? కేసిఆర్ నిర్ణయం సరికాదనే  అభిప్రాయం తెరాస నాయకుల్లోనే వినిపిస్తోంది.  నిజానికి  కేసీఆర్ వ్యాఖ్యలతో మొక్కజొన్న రైతులు కాస్త మనస్తాపానికి గురయ్యారట. తమ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా  తాము పండిచని పంటల గురించి కేసిఆర్  కహానీలు చెబుతూ  కాలం వెల్లబుచ్చుతున్నాడని స్వయంగా రైతులే విమర్శలు చేస్తున్నారు.            
 
పైగా వలస కార్మికుల వ్యవహారంలో కూడా కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. రైతుల కోసం కేసిఆర్ ఏమి చేయట్లేదని ప్రతిపక్షాలు కూడా  విమర్శిస్తున్నాయి.  పోతిరెడ్డిపాటు సామర్థ్యం పెంచుతామని ఏపీ సర్కార్ జీవో ఇచ్చిన సీఎం కేసీఆర్ మిన్నకుండిపోయారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫైరయ్యారు. ఇప్పటివరకు కంపెనీలను బెదిరించిన కేసీఆర్.. ఇప్పుడు రైతులను బెదిరిస్తున్నారని విమర్శలు చేశారు.  ఏపీ సీఎం జగన్‌తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. మరి ఈ విమర్శలకు  కేసీఆరే క్లారిటీ ఇవ్వాలి.