ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈఎస్ఐ కుంభకోణంలో భాగంగా ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు టీడీపీ నుండి మరో ఇద్దరు అరెస్ట్ అయ్యే చాన్స్ ఉందని ఏసీబీ వర్గాలు అంటున్నాయి. అచ్చెన్న తర్వాత కార్మికశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పితాని సత్యనారాయణ అరెస్ట్ కూడా తప్పదని తెలుస్తోంది. ఎందుకంటే అచ్చెన్న హయంలోలో మొదలైన ఈఎస్ఐ స్కామ్, పితాని హయాంలో కూడా కంటిన్యూ అయ్యిందని ఏసీబీ వర్గాలు తేల్చాయి.
ఈ నేపధ్యంలో పితాని మంత్రిగా ఉన్నప్పుడు చక్రం తిప్పిన ఆయన తనయుడు వెంకట సురేష్ కూడా ఈఎస్ఐ స్కామ్‌లో హస్తం ఉందని, ఏసీబీ విచారణలో తేలిందని వార్తలు వస్తున్నాయి. దీంతో అరెస్ట్ భయంతో వెంకట సురేష్, పితాని సత్యనారాయణ పీఎస్‌గా వ్యవహరించిన మురళీ మోహన్‌లు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే తాజాగా ఈ ఇద్దరి పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఇక ఇప్పటికే పీఎస్ మురళీని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఇక మరోవైపు పితాని సురేష్ బెయిలును కోర్టు తిరస్కరించడంతో ఆయన్ని అరెస్ట్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పితాని సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరి ఈఎస్ఐ స్కామ్‌లో ఇప్పటికే అచ్చెన్నాయుడుని అరెస్ట్ అవగా, ఇప్పుడు పితాని సత్యనారాయణ, ఆయన తనయుడుని ఏసీబీ అరెస్ట్ చేస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా ఈఎస్ఐ స్కామ్‌లో భాగంగా తెలుగుదేశం పార్టీని మరిన్ని వికెట్లు పడడం ఖాయమని రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు.