తెలంగాణలో కరోనా ఉగ్రరూపం తీవ్రత రోజురోజుకు పెరుగుతూనే ఉంది గాని తగ్గట్లేదు. కరోనా కేసులు ప్రతి రోజూ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో భారీగా నమోదవుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. కరోనా కట్టడి పై ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన కంట్రోల్ కావడంలేదు. గత కొన్నిరోజులుగా తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుందనేది వాస్తవ పరిస్థితుల సారాంశం. అయితే కేసుల సంఖ్య పెరుగుదల విషయంలో కేసీఆర్ సర్కార్ చేతులేత్తిసిందా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఏపీలో కూడా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండగా ప్రభుత్వం టెస్టులను భారీగా చేస్తోంది.
పైగా ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న మూడు జిల్లాలో సంపూర్ణ లాక్డౌన్ విధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోనూ కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం జరుగుతున్నా కేసీఆర్ మాత్రం సైలెంట్ గా ఉంటున్నాడు. కరోనా వచ్చినవారు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో రాష్ట్రంలో మొత్తంగా ఇప్పటివరకు 6,526కరోనా కేసులు నమోదుకాగా 198కరోనాతో మృతిచెందారు.
కాగా జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం కేసుల సంఖ్య 4,526కు చేరాయట. కరోనా కేసులు పెరుగుతుండటంతో హైదరాబాద్లో 50వేల కరోనా టెస్టులను చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గాని, ఆ పక్రియ ఖచ్చితత్వంతో జరగట్లేదు.అలాగే ప్రైవేటు ల్యాబ్ లో కరోనా టెస్టులకు అనుమతి ఇచ్చినా అక్కడ డబ్బుల దోపిడీ తప్ప మరొకటి కానరావడం లేదు.