అనంత పద్మనాభస్వామి ఆరవ నేలమాళిగను తెరుస్తారా 

Supreme court final judgement on Padmanabhaswamy temple
కేరకేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయ బాద్యతల విషయంలో సుప్రీం కోర్టు తుది తీర్పును వెలువరించింది.  2011 జనవరి 31న ఆలయ భాద్యతను ట్రావెన్ కోర్ కుటుంబం నుండి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది.  ఈ తీర్పును సవాల్ చేస్తూ ట్రావెన్ కోర్ కుటుంబం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.  ఈ కేసులో పూర్తి విచారణ జరిపిన సుప్రీం కోర్టు తీర్పును గతేడాది ఏప్రిల్ నెలలో రిజర్వ్ చేసి ఈరోజే అనంత పద్మనాభస్వామి ఆలయ బాద్యతలు ట్రావెన్ కోర్ రాజకుటుంబమే చూసుకుంటుందని తుది తీర్పును వెలువరించింది.  దీంతో ఆరవ నేల మాళిగను తెరవాలా వద్దా అనే నిర్ణయం కూడా ట్రావెన్ కోర్ రాజవంశీకులకే వెళ్లినట్టయింది. 
 
2011లో ఆలయంలో అపార సంపద వెలుగు చూసింది.  దీంతో దేశం దృష్టి మొత్తం అనంత పద్మనాభుడి మీదే పడింది.  అప్పటివరకు దేశంలోనే అత్యంత సంపన్న దేవస్థానంగా ఉన్న తిరుమలను అనంత పద్మనాభస్వామి దేవాలయం దాటి మొదటి స్థానంలోకి వచ్చింది.  అప్పటి నుండి వరుసగా తెరిచిన ఐదు నేలమాళిగల్లో లక్షల కోట్ల సంపద బయటపడగా ఆరవ గది తెరవడం మీద వాదోపవాదాలనలు జరుగుతూ వచ్చాయి.  ప్రభుత్వమే చొరవ తీసుకుని గది తలుపులు తెరవాలని నాస్తికులు, తెరిస్తే అరిష్టమని భక్తులు డిమాండ్ చేస్తూ వచ్చారు. 
 
దీంతో ఆరో గదిని తాము ఆదేశించే వరకు తెరవకూడదని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.  చివరకు సుప్రీం కోర్టు కూడా ఆ నిర్ణయాన్ని రాజకుటుంబానికే వదిలేసింది.  ఇప్పటికే సుప్రీం కోర్టు ఆలయ నిర్వహణ బాధ్యతలన్నీ ట్రావెన్‌ కోర్‌ రాజకుటుంబానికే చెందుతాయని స్పష్టం చేసింది.  దీంతో ఆలయంలోని ఆరో గది తెరవాలా.. వద్దా.. అనేది రాజకుటుంబం నిర్ణయం మీదే ఆధారపడి ఉంది.