విశాఖ గురించి యూఎస్ డిప్యూటీ హైక‌మీష‌న‌ర్ ఏమ‌న్నారంటే?

సుంద‌ర న‌గ‌రం విశాఖప‌ట్ట‌ణం వ‌న్నె గురించి తెలియంది ఎవ‌రికి. సాగ‌ర‌తీరం గ‌ల న‌గ‌రంగా, ఉక్కున‌గ‌రంగా, సుంద‌ర న‌గ‌రంగాపేరు గాంచిన విశాఖ అందానికి పెట్టింది పేరు. అక్క‌డ ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణానికి ఎవ‌రైనా ఫిదా అవ్వాల్సిందే. గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉన్న న‌గ‌రంగా విశాఖ‌కు ప్ర‌త్యేక‌మైన చ‌రిత్ర ఉంది. పారిశ్రామిక కేంద్రంగాను విశాఖ కు ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. అటు సాగర తీరం.. ఇటు పచ్చని కొండలు.. మధ్యలో అందాల నగరం విశాఖపట్నం. పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటునే న‌గ‌రం. ఇక్కడి బీచ్‌లు, ఉద్యానవనాలు, ఆలయాలు, బౌద్ధరామాలు, ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఈ నగరం సొంతం.

తాజాగా ఈ సుంద‌ర న‌గ‌రం గొప్ప‌ద‌నం గురించి తెలుగు రాష్ర్టాల యూఎస్ డిప్యూటీ హైక‌మీష‌నర్ అండ్ర ప్లెమింగ్ ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేసారు. వైజాగ్ అందాల్ని పొగుడుతూ సుంద‌ర న‌గ‌రాన్ని ఆకాశానికి ఎత్తేసారు. వైజాగ్ లాంటి సుందర ప్రదేశం ప్ర‌పంచంలో మ‌రెక్క‌డా లేద‌న్నారు. విశాఖ నగరంలో ఉన్న రోడ్లు దేశంలో ఎక్కడా కనిపించవని..ఆ రోడ్లు చాలా అందంగా, అద్భుతంగా ఉంటాయ‌న్నారు. విశాఖ తీరం చాలా చిత్ర‌మైన‌ది. అంతా వైజాగ్ అని పిలుచుకునే ఈసీటి ఆఫ్ డెస్టినీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అతి పెద్ద న‌గ‌రం. అంతేకాదు చాలా మంది అంత‌ర్జాతీయ ఉద్యోగులున్న హెచ్ ఎస్ బీసీ విశాఖ‌లో ఉండ‌టంతో…అక్క‌డ ఉద్యోగాలు చేసుకోవ‌డం నిజంగా వాళ్ల ల‌క్కీ అంటూ పొగిడారు.

ఆ సిటీని వ‌దిలి రావాలంటే అస్స‌లు బుద్ది పుట్ట‌దు. ఆ సిటీ లో దొరికిన పీస్ ప్ర‌పంచంలో ఇంకెక్క‌డా దొర‌క‌లేద‌న్నారు. క‌రోనా కార‌ణంగా మూడు నెల‌లుగా సుంద‌ర‌న‌గ‌రాన్ని ఎంతో మిస్ అవుతున్నాన‌న్నారు. విశాఖని మిస్‌ అవుతున్నానంటూ.. ఏరియల్ వ్యూ ఫొటోతో ఫ్లెమింగ్‌ చేసిన ఈ ట్వీట్‌కు నెటిజన్లు లైక్‌లు.. రీట్వీట్లు పెద్ద ఎత్తున చేస్తున్నారు. విశాఖ‌తో త‌మ‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆసియాలోనే సుంద‌ర న‌గ‌రంగా విశాఖ‌కు ప్ర‌త్యేకమైన స్థాన‌ముంది. ఇక విశాఖ గురించి బాలీవుడ్, టాలీవుడ్ స‌హా అన్ని భాష‌ల ప‌రిశ్ర‌మ‌ల న‌టులు ఎన్నోసార్లు గొప్ప‌గా చెప్పారు. భార‌త క్రికెట‌ర్లు సాగ‌ర‌న‌గ‌రం గురించి ఎంతో అద్భుతంగా..అందంగా వ‌ర్ణించారు.