చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు.. భారీగా పెరిగిన పసిడి రేటు!

gold

బంగారం ధర రోజు రోజుకు పెరుగుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 280 పెరిగి రూ. 52,590కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరుగుదలతో రూ. 48,200కు ఎగసింది. బంగారం ధర 2 రోజుల్లోనే రూ.900కు పైగా పెరిగింది. వెండి రేటు కూడా పెరిగింది. వెండి ధర రూ.1000 పెరిగింది. ప్రస్తుత సిల్వర్ రేటు రూ. 73,800కు చేరింది. వెండి రెండు రోజుల్లో రూ.1900 పైకి కదిలింది. విజయవాడ, విశాఖపట్నంలో ఇదే రేట్లు కొనసాగుతున్నాయి.