ప్రపంచాన్ని చుట్టేస్తోన్న మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఎన్ని రకాలుగా మానవాళిపై దాడి చేయోలో అన్ని రకాలుగాను చేసింది. లాక్ డౌన్…భౌతికదూరం..శానిటైజర్..శుభ్రం అంటూ చాలా జాగ్రత్తలు తీసుకున్నా మహమ్మారి మాత్రం అదుపులోకి రాలేదు. కొవిడ్ బాధితులు రోజు రోజుకి పెరుగుతున్నారే తప్ప తగ్గినా దాఖలాలు కనిపించడం లేదు. ఇక వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందా? లేదా? కొన్ని నెలలుగా సస్పెన్స్ కొనసాగుతోంది డబ్లూ హెచ్ వో గాలి ద్వారా సోకడం లేదని ప్రకటించినా…మరో వైపు దీనికి సంబంధించి పరిశోధలను మాత్రం ఆగలేదు. ఓవైపు గాలి ద్వారా వ్యాపిస్తుందా? లేదా? పరిశోధలను జరుగుతూనే ఉన్నాయి.
ఇటీవలే 32 దేశాలకు చెందిన 239 మంది పరిశోధకులు గాలి ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతుందని డబ్లు హెచ్ ఓకి లేఖ రాసారు. తమ దగ్గర అందుకు పక్కా ఆధారాలున్నాయని లేఖలో పేర్కొన్నారు. కొవిడ్-19 వైరస్ వ్యాప్తిపై ఈ మేరకు సిఫార్సులను సవరించాలని వారు కోరారు. దీంతో కొన్ని దేశాల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది. ఇప్పటివరకూ గాలిలో లేదని బయట తిరిగే జనం గుండెల్లో కూడా రైళ్లు పరిగెత్తడం మొదలైంది. మాయదారి మహమ్మారి గాలి ద్వారా కూడా వస్తుందా? అని బెంబేలెత్తిపోయారు. అయితే ఇంకొన్ని దేశాలు డబ్లూ హెచ్ ఓ నిర్ధారించలేదు కాబట్టి అంతగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు తాజాగా డబ్లు హెచ్ ఓ పిడుగు లాంటి వార్త వెల్లడించింది.
గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందనే వాదనని కాదనలేమని అంటోంది. ఆధారలున్నాయని చెబుతూనే కచ్చితంగా మాత్రం వెల్లడించలేపోతున్నారు ఆ సంస్థ ప్రతినిధులు. పరిశోధకుల వాదనాలు కాదనలేమని మాత్రం కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. వైరస్ వ్యాప్తి పద్దతిలో ఇది కూడా ఓ మార్గం అయి ఉండచ్చని సందేహం వ్యక్తం చేసారు. దీంతో ప్రపంచ దేశాల్లో మరో కొత్త టెన్షన్ మొదలైంది. భారతదేశంలో ఎక్కువగా మెట్రోపాలిటన్ సిటీలు, చిన్న చిన్న టౌన్లలో ఉండే ప్రజలు మాత్రమే కరోనా బారిన పడ్డారు. పల్లెటూళ్లకు అంతాగా పాకలేదు. తాజాగా డబ్బు హెచ్ ఓ చెప్పిన దాని ప్రకారం వైరస్ గాలిలో కలిస్తే గ్రామాలకు తప్పదు ముప్పని తెలుస్తోంది.