Maargan : థియేటర్లలో సందడి చేసిన ‘మార్గన్’ టీం

విజయ్ ఆంటోని నటిస్తూ, నిర్మించిన ‘మార్గన్’ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మించగా, సర్వాంత్ రామ్ క్రియేషన్స్ బానర్ పై జె.రామాంజనేయులు సగర్వంగా సమర్పించారు. ఈ సినిమాను జూన్ 27న సురేష్ బాబు తెలుగులో రిలీజ్ చేశారు. శుక్రవారం నాడు రిలీజ్ అయిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కింది.

తెలుగు, తమిళ భాషల్లో మార్గన్ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. ఈ క్రమంలో చిత్రయూనిట్ హైదరాబాద్‌లోని పలు థియేటర్లలో సందడి చేశారు. సిటీలోని కొన్ని థియేటర్లలో సినిమాను చూస్తున్న ఆడియెన్స్‌కి ‘మార్గన్’ సర్ ప్రైజ్ ఇచ్చింది. అజయ్ ధీషన్, దీప్శిఖ, బ్రిగిడా వంటి వారు ఆడియెన్స్‌తో ముచ్చటించారు. ఆడియెన్స్ రెస్పాన్స్‌ను లైవ్‌లో చూసి ‘మార్గన్’ టీం ఫుల్ ఖుషీ అయింది.

కూటమి క్లోజ్ || Analyst Ks Prasad EXPOSED Who Benefit With Jamili Elections in Ap || TDP Vs YCP ||TR