‘సోదర సోదరీమణులారా…’ థియేట్రికల్ ట్రైలర్. సెప్టెంబర్ 15న సినిమా రిలీజ్

నూతన దర్శకుడు రఘుపతి రెడ్డి గుండ రచన, దర్శకత్వంలో కమల్ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో 9 EM ఎంటర్టైన్మెంట్స్, IR మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా విజయ్ కుమార్ పైండ్ల నిర్మిస్తున్న చిత్రం ‘సోదర సోదరీమణులారా…’. ఆకట్టుకునే టైటిల్, ఎమోషనల్ డ్రామా గా రూపొందిన ఈ సినిమా హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామా గా ప్రేక్షకులను అలరించనుంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న విడుదల కానున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.

ఆసక్తికరంగా కట్ చేసిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటి పెంచుతుంది. టైటిల్, పోస్టర్ తోనే అందరూ అన్వయించుకొనే పాత్రలతో రియాలిస్టిక్ డ్రామా గా ఈ సినిమా ఉండనుంది అనే ఫీలింగ్ కలిగించిన ‘సోదర సోదరీమణులారా..’ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా 500 థియేటర్ల లో సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నారు. వర్ధన్ నేపథ్య సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మోహన్ చారి కెమెరామెన్ గా, పవన్ శేఖర్ పసుపులేటి ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

నటీనటులు: కమల్ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో, కాలకేయ ప్రభాకర్, పృథ్వీ కీలక పాత్రల్లో నటిస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో ప్రముఖ తారాగణం కనిపించనుంది

సాంకేతిక నిపుణులు :
రచన, దర్శకత్వం : రఘుపతి రెడ్డి గుండా
నిర్మాత : విజయ్ కుమార్ పైండ్ల
సినిమాటోగ్రఫీ : మోహన్ చారి
నేపథ్య సంగీతం : వర్ధన్
ఎడిటర్ : పవన్ శేఖర్ పసుపులేటి
పి ఆర్ ఓ: బి ఏ రాజు ‘s టీం
పబ్లిసిటీ డిజైనర్ : వివ రెడ్డి