Thalli Manasu Movie Review: తల్లి మనసు మూవీ రివ్యూ

చిత్రం: తల్లి మనసు

నటీనటులు: రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య, రఘుబాబు, శుభలేఖ సుధాకర్, సాహిత్య, వైష్ణవి, దేవిప్రసాద్, ఆదర్శ్ బాలకృష్ణ, శాంతకుమార్, గౌతం రాజు, దేవిశ్రీ, తదితరులు

సాంకేతిక నిపుణులు:
కథ: శరవణన్
కథ విస్తరణ: ముత్యాల సుబ్బయ్య, మరుధూరి రాజా
మాటలు: నివాస్
పాటలు: భువనచంద్ర
సంగీతం: కోటి
డి.ఓ.పి: ఎన్.సుధాకర్ రెడ్డి
ఎడిటింగ్: నాగిరెడ్డి
ఆర్ట్: వెంకటేశ్వరరావు
సమర్పణ: ముత్యాల సుబ్బయ్య, నిర్మాత: ముత్యాల అనంత కిషోర్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి.శ్రీనివాస్ (సిప్పీ) .

ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ తొలిసారి నిర్మాతగా మారి, నిర్మించిన చిత్రం తల్లి మనసు. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమాతో వి.శ్రీనివాస్ (సిప్పీ) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జనవరి 24న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:

గణేష్ (సాత్విక్) బ్యాంక్ ఎంప్లాయ్, ఒక అమ్మాయి ప్రమీల కి లోన్ ఇచ్చి రికవరీ కోసం ఆమె చుట్టు తిరుగుతూ ఉంటాడు, జానజీరామ్ ( కమల్ కామరాజు ) కరెంట్ ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటాడు, అతని భార్య జ్యోతి (రచిత మహాలక్ష్మి) వీరి కుమారుడే గణేష్, కొన్ని అనుకోని పరిస్థితుల్లో జానకీరామ్ ప్రాణాలు కోల్పోతాడు, ఈ పరిస్థితుల్లో జ్యోతి తన కుమారుడైన గణేష్ ను కష్టాలతో పెంచుతుంది. అలాగే గణేష్ కూడా ఒక ప్రమాదంలో చనిపోతాడు, ఈ స్థితిలో జ్యోతి చరణ్ (ఆదర్శ్ బాలకృష్ణ) దగ్గర పని చేస్తూ ఉంటుంది. అసలు గణేష్, జానకీరామ్ ఎందుకు చనిపోయారు ? జ్యోతి చరణ్ దగ్గరకు ఎందుకు వస్తుంది ? ఈ కథలో మెయిన్ విలన్ ఎవరు ? గణేష్ గర్ల్ ఫ్రెండ్ ప్రమీల ఏమయ్యింది వంటి విషయాలు తెలియాలంటే… తల్లి మనసు సినిమా చూడాల్సిందే.

Badmashulu: మహేష్ చింతల ‘బద్మాషులు’- ఫస్ట్ లుక్ రిలీజ్

విశ్లేషణ:

రచిత మహాలక్ష్మి తల్లి పాత్రలో బాగా నటించింది, కమల్ కామరాజు తండ్రి పాత్రలో మెప్పించాడు, వీరిద్దరి కొడుకు పాత్రలో సాత్విక్ అద్భుతమైన నటనను కనబరిచాడు, సాహిత్య, రఘుబాబు, శుభలేఖ సుధాకర్, సాహిత్య, వైష్ణవి, దేవిప్రసాద్, ఆదర్శ్ బాలకృష్ణ, శాంతకుమార్, గౌతం రాజు, దేవిశ్రీ, తదితరులు వారి పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

శరవణన్ కథ ఈ సినిమాను ప్రధాన బలం, అలాగే సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సలహాలు సూచనలు తల్లి మనసు సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి. రచయిత నివాస్ మాటలు ,భువనచంద్ర పాటలు అర్ధవంతంగా ఉన్నాయి.

కోటి అందించిన పాటలు, నేపధ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది, డి.ఓ.పి: ఎన్.సుధాకర్ రెడ్డి కెమెరా వర్క్ బాగుంది, ఎడిటర్ నాగిరెడ్డి సినిమాను బాగా కట్ చేశారు, అలాగే ఆర్ట్ వెంకటేశ్వరరావు ఆర్ట్ వర్క్ డీసెంట్ గా ఉంది.

తల్లి మనసు సినిమా ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసిస్తుంది, ప్రస్తుత సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు ఈ సినిమా చూస్తున్నంత సేపు మనకు గుర్తు వస్తాయి. తల్లి సెంటిమెంట్ ఈ సినిమాలో బాగా చూపించారు. కుటుంభం మొత్తం కలిసి చూడగగ్గ అంశాలు ఈ సినిమాలు చాలా ఉన్నాయి. ఎక్కడా కూడా బోరింగ్ లేకుండా దర్శకుడు వి.శ్రీనివాస్ బాగా తెరకెక్కించారు. సీనియర్ లెజండరీ దర్శకుడు ముత్యాల సుబ్బయ్యా అబ్బాయి ముత్యాల అనంత కిషోర్ ఈ సినిమాతో దర్శకుడిగా మారడం విశేషం. తల్లి మనసు అనే మంచి కథతో అతను ప్రొడ్యూసర్ అయ్యారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది. తప్పకుండా ఈ సినిమాను ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు.

రేటింగ్: 3/5

లక్షల్లో సంపాదించే అద్బుత అవకాశం || PURE JAL ENTERPRISE - Alkaline Water || Telugu Rajyam