బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ -శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎర్రచీర – ది బిగినింగ్”. ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటించింది. “ఎర్రచీర – ది బిగినింగ్” మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా బిజినెస్ షో చూసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లందరూ సినిమా అద్భుతంగా ఉందని సినిమా తీసుకునేందుకు ముందుకు వచ్చారు. సినిమా కంటెంట్ డివోషనల్ టచ్ ఉన్న కంటెంట్ కావడంతో ఈ సినిమాని దీపావళి కానుకగా వారం ముందే.. అంటే అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ టీమ్ చిత్ర బృందాన్ని అభినందించారు. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ హైలైట్ గా నిలిచాయన్నారు.
వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు, ఎమ్మెల్యేలు, ఎంపీల రాజీనామాలకు సిద్ధం
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న మంత్రులు అనిత, ఆనం
ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ.. సినిమా చూసిన వారందరూ అద్భుతంగా ఉందని కొనియాడారని అన్నారు. సినిమా ఆలస్యం కావచ్చు కానీ కంటెంట్ మాత్రం ఖతర్నాక్ గా ఉందని చూసినవారు వెల్లడించారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు హారర్ బ్యాక్ డ్రాప్ లో మదర్ సెంటిమెంట్ తో తీసిన ఈ లేడీ ఓరియేంటెడ్ సినిమా అందరూ కలిసి చూసే కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ తప్పకుండా థియేటర్ కి వచ్చి చూడాలని కోరారు. ప్రమోషన్స్ జోరు పెంచుతున్నామని, అక్టోబర్ 3న రిలీజ్ ట్రైలర్ విడుదల చేసి, అక్టోబర్ 5 న విజయవాడలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తామని తెలిపారు.

ఎర్ర చీర ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర దర్శకుడు సుమన్ బాబు హరిహర వీరమల్లు డైరెక్టర్ జ్యోతి కృష్ణను కలిసి సినిమా ట్రైలర్ ను చూపించారు. ఈ సందర్బంగా డైరెక్టర్ జ్యోతి కృష్ణ మాట్లాడుతూ.. ఎర్ర చీర ట్రైలర్ చాలా బాగుందని, సినిమా అక్టోబర్ 10న విడుదల అవుతోందని, అందరూ తప్పకుండా థియేటర్లలలో చూడాలని చెప్పారు. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
నటీనటులు – బేబి సాయి తేజస్విని, సుమన్ బాబు, శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ , సురేష్ కొండేటి, రఘుబాబు, తదితరులు
టెక్నికల్ టీమ్
ఆర్ట్ – నాని, సుభాష్
స్టంట్స్ – నందు,
డైలాగ్స్ – గోపి విమల పుత్ర,
సినిమాటోగ్రఫీ – చందు
ఎడిటర్ – వెంకట ప్రభు,
చీఫ్ కో డైరెక్టర్ – నవీన్ రామ నల్లం రెడ్డి,
రాజ మోహన్
బీజీఎం – ఎస్ చిన్న
మ్యూజిక్ – ప్రమోద్ పులిగార్ల
సౌండ్ ఎఫెక్ట్స్ – ప్రదీప్
పిఆర్ఓ – సురేష్ కొండేటి
సమర్పణ – బేబీ డమరి ప్రజెంట్స్
నిర్మాత – ఎన్. వి.వి. సుబ్బారెడ్డి, సీహెచ్. వెంకట సుమన్
కథ – స్క్రీన్ ప్లే- దర్శకత్వం – సుమన్ బాబు.

