ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి ఆశీసులతో సాయి లక్ష్మీ గణపతి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సత్యం రాజేష్, శ్రవణ్ , కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో సుహాన హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం. షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి అయ్యాయి, ప్రేక్షకులు ఎంటర్టైన్ అయ్యే అనేక అంశాలతో దర్శకుడు ఎన్. కె ఈ సినిమాను నిర్మించారు.
ఎన్. కె దర్శకత్వం గ్రంధి త్రినాధ్, కో ప్రొడ్యూసర్ లోతేటి కృష్ణ నిర్మాణంలో ఎడిటర్ శివ శర్వాని సినిమాటోగ్రఫీ జి. అమర్ గా తెరకెక్కుతున్న చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్నాయి. గడ్డం నవీన్, షేకింగ్ శేషు, రాము, సూర్య, సమీర్, మురళి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు.
హైదరాబాద్, వైజాగ్ మరియు పాడేరు లో అధిక భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకులను పలకరించడానికి థియేటర్స్ లోకి రానుంది. పీఆర్ ఈ సినిమాకు నేపధ్య సంగీతం అందించారు. నభ మాస్టర్ ఫైట్స్, కళాదర్ నృత్యాలు ఈ సినిమాకు అదనపు ఆకర్షణ కానున్నాయి.