వన్డే క్రికెట్ వరల్డ్ కప్‌‌ అసోసియేషన్‌తో చరిత్ర సృష్టించనున్న ‘టైగర్ 3’

ఇప్పటి వరకు క్రికెట్ వరల్డ్ కప్ హిస్టరీతో అసోసియేషన్ అయిన బిగ్గెస్ట్ మూవీ నిర్మాణ సంస్థగా యష్ రాజ్ ఫిలిమ్స్ చరిత్ర సృష్టించనుంది. వరల్డ్ కప్ బ్రాడ్ కాస్ట్ నెట్ వర్క్‌ అయిన స్టార్ స్పోర్ట్స్‌తో వైఆర్ఎఫ్ సంస్థ చేతులు కలిపింది. దీంతో కనువినీ ఎరుగని రీతిలో దీపావళికి రిలీజ్ కానున్న టైగర్ 3 చిత్రాన్ని ప్రమోట్ చేయనున్నారు.

ఈ అసోసియేషన్ వల్ల ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ అంతా టైగర్ 3 మూవీ ప్రమోషన్స్ పరంగా మారు మోగించనుంది. క్రికెట్ వరల్డ్ కప్‌లో జరుగుతన్న మ్యాచ్‌లన్నింటిలో వైఆర్ఎఫ్ సంస్థ టైగర్ 3 చిత్రాన్ని ప్రమోట్ చేయనుందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

మరీ ముఖ్యంగా ఇండియా, పాకిస్థాన్ దేశాల మధ్య జరగబోతున్న మ్యాచ్‌లో టైగర్ 3 సినిమా గురించి ప్రమోట్ చేస్తారు. దీని కోసం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ క్రికెట్ వరల్డ్ కప్ కో బ్రాండింగ్ ప్రోమోస్‌లో నటించటం విశేషం. ఈ ప్రోమోస్‌ను ఈ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ కీలక మ్యాచుల్లో ప్రదర్శిస్తారు. ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ మార్కెటింగ్‌లో ఇదే భారీ అసోసియేషన్ మార్కెటింగ్ స్ట్రాటజీ అని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

2019లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లను 500 మిలియన్స్‌కు పైగా వీక్షించారు. మరి ముఖ్యంగా 2019లో జరిగిన ఇండియా పాకిస్థాన్ మ్యాచ్‌ను అయితే 200 మిలియన్స్‌కు పైగా చూశారు. మరి 2023లో ఈ సంఖ్య మరింత భారీగా పెరగనుంది. దీన్ని టైగర్ 3 టీమ్ క్యాష్ చేసుకోనుందని సన్నిహిత వర్గాలంటున్నాయి.

యష్ రాజ్ ఫిలిమ్స్ స్సై యూనివర్స్‌లో రూపొందుతోన్న టైగర్ 3 చిత్రాన్ని మనీష్ శర్మ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మాణంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దీపావళికి రిలీజ్ కానుంది. సల్మాన్ ఖాన్ సరసన కత్రినా కైఫ్ నటించింది.