అభిమానిని కూల్‌ చేసిన మిల్కీ బ్యూటీ!

సెలబ్రెటీలు బయటకు వెళ్తే ఎవరో ఒకరు సెల్ఫీ అని లేదా మరేదైనా కారణం చెప్పి దగ్గరకు వచ్చి మాట్లాడేందుకు, టచ్‌ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్‌ బౌన్సర్‌ లు లేకుండా బయటకు అడుగు కూడా పెట్టలేని పరిస్థితి ఉంటుంది. చుట్టూ ఎంత మంది బౌన్సర్‌ లు ఉన్నా కూడా కొన్ని సార్లు హీరోయిన్స్‌ కి అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురవుతూనే ఉంటుంది. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నాకు అదే పరిస్థితి ఎదురైంది. ఒక కార్యక్రమంకు హాజరు అయిన మిల్కీ బ్యూటీ తమన్నా ను ఫ్యాన్‌ ఒకరు దూసుకు వచ్చి పట్టుకున్నాడు.

ఆమె చేయి పట్టుకోవడంతో పాటు ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఒక్కసారిగా తమన్నా షాక్‌ అయినట్లుగా ఫేస్‌ పెట్టింది. అంతే కాకుండా ఆమె భపడిరది. బారీకేడ్లు దూకి వచ్చిన అభిమానిని బౌన్సర్‌ లు తోసేందుకు ప్రయత్నించారు. కానీ అప్పుడు తమన్నా అతడిని దగ్గరకు పిలిచింది.

కూల్‌ అవ్వు.. కాస్త నవ్వు అంది. అంతే కాకుండా అతడికి సెల్ఫీ కూడా ఇవ్వడంతో పాటు అతడితో కూల్‌ గా వ్యవహరించింది. తమన్నా చేసిన పని ప్రస్తుతం సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతోంది. ఇలా వ్యవహరించడం కొద్ది మందికే సాధ్యం అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. తమన్నా మంచి మనసుకు ఇది నిదర్శనం అంటూ ఫ్యాన్స్‌ మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే భోళా శంకర్‌ సినిమా తో చిరంజీవితో కలిసి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో వైపు తమిళ్‌ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ జైలర్‌ సినిమాలో కూడా ఈమె నటించింది.

ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాయనే నమ్మకంతో తమన్నా కనిపిస్తుంది. ఒకేసారి ఈ సినిమాలు విడుదల కాబోతున్నాయి.