బేర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వస్తోన్న చిత్రం అంధక. ఆర్యన్ బేర్, ఆనంద్ రాజ్, ఆర్.లక్ష్మీ లావణ్య, సిరి జూపల్లి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతొంది.
ఎమోషనల్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.
సరికొత్త కథ కథనాలతో దర్శకులు దేవరాజ్ పెద్దింటి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఆర్యన్ బేర్ ఈ సినిమాను నటిస్తూ నిర్మించడం విశేషం. వీరేంద్ర సాయినాథ్ మంతి ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం అందించారు. సాయి ప్రసాద్ తుమ్మల ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించగా అశోక్ అచిత ఈ మూవీకి ఎడిటర్.
కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆధారిస్తూ వస్తున్నారు. అదే తరహాలో వస్తోన్న మా అంధక సినిమా లోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారన్న నమ్మకం ఉంది, ముఖ్యంగా సెకండ్ హాఫ్ ప్రేక్షకులకు ఎమోషనల్ గా ఉంటుందని, సన్నివేశాలు హాట్ టచింగ్ గా ఉంటాయని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

