తొలిషెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న సుడిగాలి సుధీర్ G.O.A.T ( GreatestOfAllTimes)

ప్రముఖ హాస్యనటుడు సుడిగాలి సుధీర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం G.O.A.T ( అనేది ఉపశీర్షిక. దివ్యభారతి నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకుడు. మహాతేజ క్రియేషన్స్ పతాకంపై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ చిత్రం తొలిషెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన టైటిల్ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. రీసెంట్‌గా హైదరాబాద్‌లో తొలిషెడ్యూల్‌ను పూర్తిచేశాం. ఈ షెడ్యూల్‌లో సుధీర్, హీరోయిన్ దివ్యభారతిలపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ ఏపిసోడ్స్‌ను చిత్రీకరించాం. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడుకుండా చాలా రిచ్‌గా చిత్రాన్ని తెరకెక్కిసున్నాం. టెక్నికల్‌గా కూడా చిత్రం చాలా ఉన్నతస్థాయిలో వుంటుంది. సుడిగాలి సుధీర్ కెరీర్‌లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, డీఓపీ: బాలాజీ సుబ్రమణ్యం, ఎడిటర్: కె.విజయవర్థన్, ఆర్ట్: రాజీవ్ నాయర్, రచయిత: ఫణికృష్ణ సిరికి, పీఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు