సీనియర్ నటుడు శరత్ బాబు (71) తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో గత నెలరొజులుగా చికిత్స తీసుకుంటున్న ఆయన నేడు సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.. టాలీవుడ్‌లో వరుస విషాదాలో చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం నాడు ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ మృతి చెందగా.. ఈ రోజు సీనియర్ నటుడు శరత్ బాబు కన్ను మూశారు. మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కావడం వల్ల కోలుకోలేక ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించారు.300కి పైగా సినిమాల్లో నటించిన ఆయన హీరోగా 70 చిత్రాలు చేశారు.శరత్ బాబు మరణ వార్తతో టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా శరత్ బాబు ఆరోగ్యం విషమంగా మారడంతో బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి కొంచెం విషమించడంతో బెంగళూరు నుంచి హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. నేటి ఉదయం సోమవారం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కన్నుమూశారు. 1973లో చిత్రసీమలో అడుగుపెట్టిన శరత్ బాబు.. ‘రామరాజ్యం’ అనే చిత్రంతో తొలిసారి ప్రేక్షకుల ముందుకుకొచ్చారు. నటుడిగా తనను తాను నిరూపించుకుంటూ అంచెలంచెలుగా ఎదిగారు. ‘మూడుముళ్ల బంధం’, ‘సీతాకోక చిలుక’, ‘సంసారం ఒక చదరంగం’, ‘అన్నయ్య’, ‘ఆపద్భాందవుడు’ లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో ఆయన నటించారు.
తెలుగులోనే కాకుండా దక్షిణాది ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించి తనకంటూ ఓ మార్క్ ని ఏర్పరచుకున్నారు. శరత్ బాబు. తమిళ, కన్నడ మలయాళ సినిమాల్లో ఎన్నో క్యారెక్టర్స్ చేశారు. 1951 జులై 31న శరత్ బాబు జన్మించారు. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస. ఆయన అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. శరత్ బాబుకు ఏడుగురు అన్నదమ్ములు, ఆరుగురు అక్క చెల్లెలు ఉన్నారు. అన్నదమ్ముల్లో శరత్ బాబు మూడో వారు. 1974లో ప్రముఖ హాస్యనటి రమాప్రభను వివాహం చేసుకున్న శరత్ బాబు.. 1988లో ఆమెతో విడిపోయారు. 1990లో స్నేహ నంబియార్ అనే మహిళను పెళ్ళాడి 2011లో ఆమెతో కూడా విడాకులు తీసుకున్నారు. 1973లో విడుదలైన ‘రామరాజ్యం’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శరత్ బాబు.. నటుడిగా 300కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన నటించిన చివరి సినిమా మళ్ళీ పెళ్లి.శరత్ బాబు మరణ వార్తతో చిత్రసీమలో విషాదం నెలకొంది. ఆయన మృతిపై స్పందించిన సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.
శరత్ బాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన భౌతిక కాయాన్ని చెన్నై తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. 1973లో సినీ రంగంలోకి అడుగుపెట్టిన శరత్ బాబు తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు. చాలా సినిమాల్లో కథానాయకుడిగా, ద్వితీయ నాయకుడిగా నటించారు. శరత్ బాబు తన 40 ఏళ్ల సినీ జీవితంలో 300కు పైగా పాత్రల్లో నటించారు. ఇటీవల చిత్ర పరిశ్రమకు కాస్త దూరంగా ఉన్న శరత్ బాబు చివరిసారిగా పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించారు. 70 కి పైగా సినిమాల్లో హీరోగా నటించారు.
హీరోగా కంటే నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలు ఆయనకు ఎక్కువగా గుర్తింపు తీసుకొచ్చాయి. దిగ్గజ దర్శకుడు బాలచందర్ రూపొందిన గుప్పెడు మనసు, ఇది కథ కాదు, పంతులమ్మతో పాటు పలు సినిమాలు శరత్‌బాబు నటనను వెలుగులోకి తీసుకొచ్చాయి. సీతాకోకచిలుక, క్రిమినల్, కోకిల, సితార, సింహగర్జన, తోడు, స్వాతి, అన్వేషణ, సంసారం ఓ చదరంగం, అభినందన, నీరాజనంతో పాటు పలు తెలుగు సినిమాలు శరత్‌బాబుకు మంచి పేరు తెచ్చిపెట్టాయి సీతాకోకచిలుక, ఓ భార్య కథ, నీరాజనం సినిమాలకుగాను నంది అవార్డులను అందుకున్నారు శరత్ బాబు.