హిలేరియస్ గా జరిగిన సేవ్ ద టైగర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్

ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’. భార్యభర్తల మధ్య జరిగే భిన్నమైన కథల సమాహారంగా రూపొందిన ఈ సిరీస్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సిరీస్ ఆడియన్స్ లో ఆసక్తిని పెంచింది. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా వస్తోన్న సేవ్ ద టైగర్స్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ జరిగింది.

ఈ సందర్భంగా దర్శకుడు తేజ కాకుమాను మాట్లాడుతూ.. ‘అందరికీ నేను నటుడుగా తెలుసు. నటుడుగా నాకు అవకాశాలిచ్చిన దర్శకులకు, దర్శకుడుగా అవకాశం ఇచ్చిన నటులకు థాంక్యూ సోమచ్. నేను డైరెక్షన్ డిపార్ట్ మెంట్ తోనే కెరీర్ మొదలుపెట్టాను. ప్రదీప్ అద్వైతం అన్న చేసిన సినిమాలన్నిటికీ డైరెక్షన్ టీమ్ లో పనిచేశాను. ఆయన రాసిన ఈ కథను నన్ను డైరెక్ట్ చేయమని చెప్పారు. ఈ సందర్భంగా జీవితాంతం ప్రదీప్ అన్నకు థాంక్స్. అలాగే నేను దర్శకుడు అన్న వెంటనే ఒప్పుకు మరో క్రియేటర్ మహి వి రాఘవ గారికీ ధన్యవాదాలు చెబుతున్నాను. మా టీమ్ అంతా మంచి యాక్టర్స్. అందరూ టాలెంటెడ్ కావడంతో వీరితో పనిచేయడం చాలా ఈజీ అయిపోయింది. రైటర్స్ కు నాకు మధ్య ఉన్న ఆర్టిస్టులు కీలకంగా ఉన్నారు. మా హీరోయిన్లు పావని, జోర్దర్ సుజాత, దేవయానికీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్యూ సో మచ్. మీరు పూర్తిగా సహకరించడం వల్లే ఒకే యేడాదిలో షూటింగ్ పూర్తి చేసుకోగలిగాం..’ అన్నారు..

సినిమాటోగ్రాఫర్ విశ్వేశ్వర్ గారు మాట్లాడుతూ.. ‘ప్రదీప్ తో నాది చాలాకాలపు స్నేహం. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కంటే మేం మంచి ఫ్రెండ్స్. సేవ్ ద టైగర్స్ ఐడియా స్టార్ట్ అయిన దగ్గర్నుంచీ ఎన్నో ఒడిదుడుకులు చూశాం. బడ్జెట్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం. చివరికి హాట్ స్టార్ వరకూ రావడంం అనేది చాలా హ్యాపీగా ఉంది. షూటింగ్ అంతా ఫన్నీగా సాగింది. ఈ అవకాశం ఇచ్చిన ప్రదీప్ , మహికి థ్యాంక్స్. దర్శకుడు తేజ తమ్ముడులాంటి వాడు. థ్యాంక్యూ సో మచ్.. ’అన్నారు.

సంగీత దర్శకుడు అజయ్ మాట్లాడుతూ.. ‘ప్రదీప్ గారు చాలాకాలంగా తెలుసు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ కు ఎంజాయ్ చేసినట్టుగా మరే ప్రాజెక్ట్ కూ ఎంజాయ్ చేయలేదు. ఈ చిత్రంలో అభినవ్, రోహిణి గారి ట్రాక్ అంటే చాలా ఇష్టం.. ’అన్నారు.

ఎడిటర్ శ్రవణ్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రాజెక్ట్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు రూమ్ లో ఒక్కడినే ఉండేవాడిని. ప్రతి కథకూ విపరీతంగా నవ్వుకున్నాను. దీనివల్ల వర్క్ కూడా ఆలస్యం అయ్యేది. ఈ సీరీస్ లో దర్శి ఎపిసోడ్ నాకు ఇష్టం. ఈ సిరీస్ చూసిన ప్రతి ఒక్కరికి అది వారి బయోపిక్ లానే అనిపిస్తుంది. ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది.. ’ అన్నారు.

నటుడు చైతన్య కృష్ణ మాట్లాడుతూ .. ‘నాకు ఎవరైనా కథ చెప్పి నా పాత్ర గురించి చెబుతారు. బట్ ప్రదీప్ వాళ్లు నాకు మొత్తం స్క్రిప్ట్ పంపించారు. నాకు ఫస్ట్ ఎపిసోడ్ చదవగానే అద్భుతం అనిపించింది. టాప్ క్లాస్ రైటింగ్ లా ఉంది. ఇక ప్రతి ఇంట్లోనూ ఆడవారిదే పై చేయి. ఆడవాళ్లు అంటే మోస్ట్ పవర్ ఫుల్. ఇక ఈ సీరీస్ మాత్రం చాలా హిలేరియస్ గా ఉంటుంది. ఈ మధ్య సిరీస్అనగానే థ్రిల్లర్సే ఎక్కువగా వస్తున్నాయి. బట్ ఇది మాత్రం చూస్తున్నంత సేపూ నవ్వుతూనే ఉంటారు.. ’ అన్నారు.

హీరోయిన్ దేవయాని మాట్లాడుతూ.. ‘నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రదీప్, మహి రాఘవ గారికి థ్యాంక్యూ సో మచ్. చైతన్యతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. నా కో ఆర్టిస్టులంతా సపోర్టివ్ గా ఉన్నారు. ప్రాజెక్ట్ పూర్తయ్యేంత వరకూ నాకు హెల్ప్ ఫుల్ గానే ఉన్నారు. మా కెమెరామేన్ బాగా చూపించారు.. ఈ సీరీస్ మీ అందరికీ నచ్చుతుంది’ అన్నారు.

రచయితలు విజయ్, కార్తీక్ మాట్లాడుతూ.. ‘కోవిడ్ కంటే ముందే రాయడం మొదలుపెట్టాము. ఈ కథలో చాలా సీన్స్ లో మా లైఫ్ లో జరిగినవే. ముఖ్యంగా చాలా సీన్స్ ప్రదీప్ తో కలిసి రియల్ గా ఎన్నోసార్లు పంచుకున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన మహి వి రాఘవ, ప్రదీప్ గారితో పాటు దర్శకుడు తేజ, టెక్నీషియన్స్, ఆర్టిస్ట్స్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాము.. ’ అన్నారు.

నటుడు అభినవ్ గోమటం మాట్లాడుతూ.. ‘ఈ నగరానికి ఏమైంది సినిమా తర్వాత ఇంతమంది యాక్టర్స్ తో పనిచేయడం ఇదే ఫస్ట్ టైమ్. మా సీక్వెన్స్ పక్కకి పెడితే.. మిగతా అన్ని సిరీస్ లలో చాలామంది ఆర్టిస్టులు పనిచేశారు. మా సీన్స్ తో వారితో షేర్ చేసుకున్నాము. షాట్ గ్యాప్ వస్తే చాలా చాలా సరదాగా ఉండేవాళ్లం. అలాగే అన్ని షెడ్యూల్స్ బాగా ప్లాన్ చేశారు. నాకైతే ప్రియదర్శి, సుజాత ట్రాక్ బాగా ఇష్టం. కృష్ణ, దేవయాని ట్రాక్ చాలా హానెస్ట్ గా ఉంటుంది..’ అన్నారు.

నటి పావని మాట్లాడుతూ.. ‘నాకు పర్సనల్ గా ప్రియదర్శి, సుజాత ఎపిసోడ్ అంటే ఇష్టం. అలాగే అభినవ్, రోహిణి మధ్య వచ్చే ట్రాక్ చాలాబావుంటుంది. ఈ సీరీస్ తో అందరం ఫ్యామిలీలాగా కనెక్ట్ అయిపోయాం. ప్రివ్యూ చూసిన తర్వాత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇంత మంచి ప్రాజెక్ట్ లో భాగమైనందుకు సంతోషంగా ఉంది.. ’ అన్నారు.

నటి సుజాత మాట్లాడుతూ.. ‘మహి రాఘవ గారికి, ప్రదీప్ గారికి, డైరెక్టర్ తేజ, కెమెరామెన్ విశ్వగారికి పాదాభివందనం చేస్తున్నాను. ఈ కథ విన్నప్పుడు చాలా ఈజీగానే చేస్తా అనుకున్నాను. బట్ ఎలా ప్రొజెక్ట్ అయితదో తెలియదు. నా ఫస్ట్ సీరీస్ మీ చేతుల మీదుగా లాంచ్ కావడం హ్యాపీగా ఉంది. అన్ని విషయాల్లోనూ చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్యూ సో మచ్. నా కో ఆర్టిస్ట్ ప్రియదర్శి చాలా కో ఆపరేట్ చేశారు.. ’అన్నారు.

నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘నేను పెద్దగా మాట్లాడటానికి ఏం లేదు. ఈ సిరీస్ ప్రీమియర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బలగంతో అందరినీ ఏడిపించాము. ఈ మూవీతో ఓ రేంజ్ లో నవ్వించాం. ఈ ప్రాజెక్ట్ లో పార్ట్ అయినందుకు సంతోషంగా ఉంది. షూటింగ్ అంతా చాలా ఫన్ తో సాగింది. ప్రదీప్ గారితో పాటు విజయ్, కార్తీక్ లు అద్భుతంగా రాశారు. మహి గారు చాలా ఇన్స్ స్పైర్ చేస్తారు. ఇలాంటి ప్రాజెక్ట్ చేశానని చాలా గర్వంగా చెప్పుకుంటాను.. ’ అన్నారు.

ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ కాబోతోన్న ఈ సీరీస్ లో ప్రియదర్శి, సుజాత, అభినవ్ గోమటం, పావని, చైతన్య కృష్ణ, దేవయాని, రోహిణి,సద్దాం, గంగవ్వ, వేణు టిల్లు తదితరులు నటించారు.

సాంకేతిక నిపుణులు
క్రియేటర్స్ : మహి వి రాఘవ, ప్రదీప్ అద్వైతం
ఎడిటర్ : శ్రవణ్ కటికనేని
సినిమాటోగ్రాఫర్ : ఎస్.వి. విశ్వేశ్వర్
కాస్ట్యూమ్ డిజైనర్ : హైందవి సుద
పిఆర్ఓ : జిఎస్కే మీడియా
రచయితలు : ప్రదీప్ అద్వైతం, విజయ్, కార్తీక్
దర్శకత్వం : తేజ కాకుమాను