యంగ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ మాధవ్ కథానాయకుడిగా శివ ప్రసాద్ స్వీయ దర్శక నిర్మాణంలో శ్రీ పద్మిని సినిమాస్ ప్రొడక్షన్ నెంబర్ 3గా రూపొందుతున్న చిత్రం ‘మాహతి’. సుహాసిని మణిరత్నం, దీప్సిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రోజు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది.
ముహూర్తపు సన్నీవేషానికి చంద్రమౌళి క్లాప్ కొట్టగా, పద్మ కెమరా స్విచాన్ చేశారు. సుహాసిని మణిరత్నం మేకర్స్ కు స్క్రిప్ట్ ని అందించగా తొలి షాట్ కి రాజారవీంద్ర గౌరవ దర్శకత్వం వహించారు.
సినిమా లాంచింగ్ ఈవెంట్ లో సుహాసిని మణిరత్నం మాట్లాడుతూ.. మహతి సినిమా ముహూర్తంలో అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా వుంది. నా తొలి సినిమా విడుదలై నేటికి సరిగ్గా 43 ఏళ్ళు అవుతుంది. పరిశ్రమలో 44 ఏడాదిగా మహతి సినిమాతో ప్రారంభిస్తున్నాను. ఇప్పటివరకూ కెరీర్లో ఎన్నో చిత్రాలు చేశాను. ఎన్నో జయపజయలు చూశాను. అవన్నీ గతంలోనే వదిలేసి ఇప్పుడు తొలి సినిమా చేస్తున్న అనుభూతితోనే ఈ చిత్రాన్ని చేస్తున్నాను. తెలుగు సినిమాలో చేయడం ఒక అలవాటుగా మారింది. కథ, పాత్ర నచ్చితేనే సినిమా చేస్తాను. మహతి కథ, నా పాత్ర చాలా నచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ వుంటాయి. టైటిల్ కి తగట్టు మహిళా ప్రాధాన్యత గల చక్కని అంశాలు వున్నాయి. ఒక క్రైమ్ చేయడం కంటే ఆ క్రైమ్ ని చూస్తూ ఏం చేయకుండా ఊరుకోవడం ఇంకా పెద్ద క్రైమ్. అదే ఈ సినిమా ప్రధానాంశం. ఇందులో వుండే పాత్రలని అద్భుతంగా తీర్చిదిద్దారు దర్శకుడు. చాలా మంచి టీం కలసి పని చేస్తున్నాం. టీం అందరికీ బెస్ట్ విషెస్’’ తెలిపారు.
సందీప్ మాధవ్ మాట్లాడుతూ.. మహతి కథ వినప్పుడు చాలా ఎక్సయిటింగ్ ఫీలైయ్యాను. డైరెక్టర్ శివ గారు ఆద్యంతం ఆకట్టుకునేలా ఈ కథని తీర్చిదిద్దారు. నా పాత్రకు డిఫరెంట్ షేడ్స్ వుంటాయి. చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. సుహాసిని గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా అనందంగా వుంది. ఈ చిత్రానికి రాహుల్ డీవోపీగా పని చేస్తున్నారు. ఆయనతో వంగవీటి సినిమా చేశాను. ఇప్పుడు మళ్ళీ కలిసి పని చేయడం ఆనందంగా వుంది. చాలా మంచి టీంతో ఈ సినిమా చేస్తున్నాము. ఖచ్చితంగా సినిమా ప్రేక్షకులని అలరిస్తుంది’’ అన్నారు
దీప్సిక మాట్లాడుతూ.. మహతి కథ అద్భుతంగా వుంటుంది. ఇందులో నా పాత్ర అందరినీ ఆకట్టుకునేలా వుంటుంది. సందీప్ తో వర్క్ చేయడం ఆనందంగా వుంది. సుహాసిని గారితో కలసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. దర్శకుడు శివ గారు ఈ కథని చాలా చక్కగా డిజైన్ చేశారు. తెలుగులో ఇది నాకు చాలా మంచి చిత్రం అవుతుందనే నమ్మకం వుంది’’ అన్నారు.
రాజా రవీంద్ర మాట్లాడుతూ.. సుహాసిని గారు, సందీప్ మాధవ్ కథ విషయంలో చాలా పర్టిక్యులర్ గా వుంటారు. వాళ్ళు ఈ కథని ఒప్పుకున్నారని తెలియగానే మరో ఆలోచన లేకుండా నా పాత్ర ఎలా వున్నా చేస్తానని చెప్పాను. డైరెక్టర్ శివ గారి సినిమా అంటే చాలా ప్యాషన్. చాలా పాజిటివ్ పర్సన్. చాలా మంచి టీంతో చేస్తున్న ఈ సినిమా తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది’’ అన్నారు
గౌతమ్ రాజు మాట్లాడుతూ… దర్శకుడు శివ ప్రసాద్ కష్టపడి ఎదిగిన వ్యక్తి. చాలా అద్భుతమైన కథని సిద్ధం చేశారు. సుహాసిని గారు ఈ కథని అంగీకరించడమే విజయానికి తొలిమెట్టని భావిస్తున్నాను. మహతి సినిమాలో సుహాసిని గారు వుండటం ఒక ఎసెట్. ఈ సినిమాని ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను
దర్శక, నిర్మాత శివ ప్రసాద్ బూర్లె మాట్లాడుతూ.. దర్శకుడిగా ఇది నా రెండో చిత్రం. నిర్మాతగా మూడవది. సుహాసిని గారికి కథ చెప్పగానే మరో మాట లేకుండా ఎప్పుడు చేస్తున్నావ్ అన్నారు. అలాగే మా హీరో సందీప్ గారు, మిగతా టీంసభ్యులంతా కథని బలంగా నమ్మారు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెడతాననే నమ్మకం వుంది’’ అన్నారు.
ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. స్టార్ కంపోజర్ శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. రాహుల్ శ్రీ వాస్తవ్ డీవోపీగా, రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
తారాగణం: సందీప్, సుహాసిని మణిరత్నం, దీప్సిక, అనీష్ కురివిల్లా, హర్శవర్షన్, రాజారవీంద్ర, భద్రం, కాశీవిశ్వనాథ్, సి.వి.ఎల్ నరసింహరావు, గౌతం రాజు, కోటేశ్వరరావు
టెక్నికల్ టీం:
రచన, దర్శకత్వం: శివ ప్రసాద్
బ్యానర్: శ్రీ పద్మిని
సంగీతం: శేఖర్ చంద్ర
డివోపీ: రాహుల్ శ్రీవాస్తవ్
కొరియోగ్రఫీ: మొయిన్
పీఆర్వో: తేజస్వీ సజ్జ