Sai Durgha Tej: సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని రెజొనెన్స్ కాలేజ్ స్నాతకోత్సవ కార్యక్రమం(రెజో ఫెస్ట్ 2025)లో సందడి చేశారు. కాలేజీ లైఫ్ మళ్లీ రాదు.. నాకు నా కాలేజ్ రోజులు గుర్తుకు వస్తున్నాయి.. ఇక్కడే మనం అన్నీ నేర్చుకుంటాం.. అంటూ తన మనసులోని మాటల్ని పంచుకున్నారు. ఆయన అక్కడి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అవేంటో ఓ సారి చూద్దాం..
ఈ కార్యక్రమంలో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ‘నన్ను ఇక్కడకు పిలిచిన రెజో ఫెస్ట్ టీంకు థాంక్స్. కాలేజీ లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్‌తో కలిసి సమయాన్ని గడపండి. అన్నింటి కంటే ముఖ్యంగా చదువుని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. అందరూ చక్కగా చదువుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం అందరూ కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. టీచర్స్‌తో కలిసి స్టూడెంట్స్ అంతా కూడా మంచి మెమోరీస్‌ను క్రియేట్ చేసుకోండి’ అని అన్నారు.

మీరు ఎప్పుడైనా ఈ స్థాయికి ఎదుగుతారని అనుకున్నారా?
నేను ఎప్పుడూ కూడా ఈ స్థాయికి ఎదుగుతానని అనుకోలేదు. నా సినిమాలతో ఆడియెన్స్‌ను సంతోషపర్చాలని మాత్రమే అనుకున్నాను.
మీకు ఫ్రెండ్ అవ్వాలనే మాలో ఉండాల్సిన లక్షణాలు ఏంటి?
బాగా చదువుకునే వాళ్లు, అమ్మానాన్నల్ని ప్రేమగా చూసుకునేవాళ్లు, డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకునే వాళ్లని నేను నా ఫ్రెండ్స్ జాబితాలో చేర్చుకుంటాను.

మీ కాలేజ్ లైఫ్‌లో చేసిన అడ్వెంచర్స్ ఏంటి?
నేను నా కాలేజీ లైఫ్‌లో చాలా సార్లు క్లాసులకు డుమ్మా కొట్టాను. కాలేజ్ బంక్ కొట్టి మరీ టీచర్‌లని కూడా సినిమాలకు తీసుకెళ్లేవాడిని.
మీకు ఇన్‌స్పిరే షన్ ఎవరు?
నాకు మా అమ్మా, మామయ్యలే ఇన్‌స్పిరేషన్.
మీకు టైమ్ మిషిన్ లభిస్తే ఏ కాలానికి వెళ్తారు?
నేను ఎక్కడికి వెళ్లను. నాకు ఈ లైఫ్ ఇలానే నచ్చింది.
మీకు నచ్చిన లైన్, కొటేషన్ ఏంటి?
పర్యావరణాన్ని మనం కాపాడితే.. అదే మనల్ని కాపాడుతుంది.

