వాహ్.. అందాల’రాశి’!

తెలుగు చిత్రసీమలో ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది టాలీవుడ్ బ్యూటీ రాశికన్నా. తన గ్లామర్ తో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది. ఆయా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంటోంది. అంతే కాదు.. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది.

వివరాల్లోకి వెళితే.. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్న రాశి కన్నా సోషల్ మీడియాలోనూ ఎంతో చురుకుగానే వ్యవహరిస్తోంది. నెటిజనుల ప్రశ్నలకు యాక్టివ్ గానే సమాధానాలు ఇస్తోంది. నాకు డిజిటల్ ఎంట్రీ ఎంతో ఆనందాన్ని ఇస్తోంది అని కూడా చెబుతోంది. తాజాగా ఈ బ్యూటీ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. రాశి కన్నా ఫోటోలు చూసి నేటిజన్లు వాహ్.. అంటూ తెగ సంబరపడిపోతున్నారు. ఎద అందాలు, చూపులతోనే మత్తెక్కిస్తూ అందాల’రాశి’గా కనపడుతోందని వివిధ రకాల కామెట్స్ తో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.