Rasha Thadani: జయకృష్ణ ఘట్టమనేని, #AB4 లో హీరోయిన్ గా నేషనల్ సెన్సేషన్ రషా తడాని

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు, జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా లాంచ్ అవుతున్నారు. RX 100, మంగళవారం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల విజనరీ ఫిల్మ్ మేకర్ అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ వెండితెర అరంగేట్రం చేయబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను వైజయంతి మూవీస్‌ అశ్విని దత్ సమర్పిస్తున్నారు. చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు.

అద్భుతమైన కొండల మధ్య సాగే సినిమా మనసుకు హత్తుకునే ప్రేమకథ ప్రధానంగా ఉంటుంది. భావోద్వేగాలు, నిజాయితీ, రియలిజం కలగలిపిన ఈ సినిమా కొత్త తరహా ప్రేమకథగా ఉండబోతుంది.

ఈ చిత్రాన్ని కొన్నిరోజుల క్రితం ఎనౌన్స్ చేశారు. ఇప్పుడు మేకర్స్ జయ కృష్ణ ఘట్టమనేని సరసన హీరోయిన్ గా నేషనల్ సెన్సేషన్ రషా తడానిని అఫీషియల్ వెల్కమ్ చేశారు.

రషా, హీరోయిన్ రవీనా టండన్, ప్రముఖ నార్త్ ఇండియన్ డిస్ట్రిబ్యూసర్, AA Films India యజమాని అనిల్ తడాని కుమార్తె.

రషా అజాద్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి, “Uyi Amma” పాటతో ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. ఇప్పుడు #AB4 ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.

తన చిత్రాల్లో మహిళా పాత్రలకు బలమైన క్యారెక్టరైజేషన్స్ రాసే దర్శకుడు అజయ్ భూపతి, రషా కోసం ఇంటెన్స్ క్యారెక్టర్ ని డిజైన్ చేశారు.

ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. టైటిల్‌తో పాటు మరిన్ని వివరాలు త్వరలోనే రివిల్ చేస్తారు. న్యూ ఏజ్ లవ్ స్టొరీగా రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.

తారాగణం: జయ కృష్ణ ఘట్టమనేని, రషా తడాని

సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: అజయ్ భూపతి
సమర్పణ: అశ్విని దత్
నిర్మాత: పి. కిరణ్
బ్యానర్: చందమామ కథలు
పీఆర్వో: వంశీ-శేఖర్

బాలయ్యకు వార్నింగ్ || YSRCP Leaders Fire On Balakrishna Over Hindupur YCP Office Attack || TR