Saaree Trailer: రామ్ గోపాల్ వర్మ ‘శారీ’ చిత్రం నుండి స్టన్నింగ్ అండ్ ఎగర్నెస్ ట్రైలర్ రిలీజ్

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ ‘శారీ’ లాగ్ లైన్: ‘టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ’. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో,ఆర్జీవి-ఆర్వి ప్రొడక్షన్స్ LLP బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త రవి శంకర్ వర్మ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మరియు మళయాళ భాషల్లో ఈ చిత్రాన్ని 2025 ఫిబ్రవరి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా పలు నిజజీవిత సంఘటనల ఆధారాలతో సైకలాజికల్ థ్రిల్లర్ గా ‘శారీ’ మూవీ రూపొందుతోంది. ఈ రోజు ఉదయం 10 ఘంటలకు RGV డెన్ లో ‘శారీ’ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ‘మాంగో మీడియా’ ద్వారా విడుదల చేసారు.

Trailer Link : https://youtu.be/5e-BZU7mEGk?si=g5Kw_mF_W3rMvNnY 

దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ తన ఎమోషనల్ వాయిస్ తో...”సోషల్ మీడియాలో ఏవరెవరో ముక్కు మొహం తెలియని వాళ్ళతో పరిచయాలు పెంచుకుని, వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ గాని, ఫోర్ గ్రౌండ్ గాని, ఏమి తెలియకుండా నమ్మేయడంతో… ఎదురయ్యే ప్రమాదాలు, భయంకర సంఘటనలు, మనం చాలా చాలా విన్నాం! చూసాం!! అలాంటి నిజ జీవిత ఘటన ఆధారంగా తీసిన సినిమా ఈ ‘శారీ’.” అంటూ సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ల చెప్పారు.

నిర్మాత రవి శంకర్ వర్మ మాట్లాడుతూ “మా ‘శారీ’ చిత్రంలోని టీజర్, ‘ఐ వాంట్ లవ్’ అండ్ ‘ఎగిరే గువ్వలాగా…’ రెండు లిరికల్ సాంగ్స్ విడుదల చేసాము YT, అండ్ సోషల్ మీడియా లో విశేష స్పందన లభించింది. ఈ రోజు ట్రైలర్ ‘మాంగో మీడియా’ ద్వార తెలుగు, హిందీ, తమిళ, మరియు మళయాళ భాషల్లో విడుదల చేసాము. సినిమా ఈ నెల 28న అన్నీ భాషల్లో థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నాం.” అన్నారు.

బ్యానర్ : ఆర్జీవీ – ఆర్వీ ప్రొడక్షన్స్ LLP

నటీనటులు : సత్యా యాదు, ఆరాధ్య దేవి, సాహిల్ సంభవాల్, అప్పాజీ అంబరీష్, మరియు కల్పలత తదితరులు

సినిమాటోగ్రఫీ : శబరి,

నిర్మాత : రవి శంకర్ వర్మ,ద

దర్శకుడు : గిరి కృష్ణ కమల్

Chalasani Srinivas Fires On CM Chandrababu Over Medical Colleges | YS Jagan | Telugu Rajyam