పైలం పిలగా ట్రైలర్ విడుదల, సెప్టెంబర్ 20న థియేటర్స్ లో చిత్రం విడుదల !!!

హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించిన ‘పైలం పిలగా’ సినిమా. ఇప్పటికే రిలీజ్ అయిన మూడు పాటలు ట్రేండింగ్ లో నడుస్తున్నాయి . రిలీజ్ అయిన టీజర్ కి మంచి స్పందనతో చిన్న సినిమా అయినా ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది . ఈ సినిమా ట్రైలర్ ను డైరెక్టర్ వెంకటేష్ మహా లాంచ్ చేసారు.

పల్లె నుండి పట్నం దాకా ఈ గ్లోబలైజేషన్ యుగం లో యువత ఉద్యోగాల కన్నా సొంత స్టార్ట్ అప్ లు , వ్యాపారాల వైపే పరుగులు పెడుతున్నారు, కోట్లు సంపాదించాలని కలలు కంటున్నారు . ఇలాంటి ఒక యువకుడు తన ఊళ్లోనే, తన భూమిలోనే సొంత వ్యాపారం ప్రారంభించి జీవితంలో ఎదగాలనుకున్నప్పుడు పంచాయితీ ఆఫీస్ నుండి సెక్రటేరియట్ ఆఫీస్ వరకు ప్రశ్నలు , సవాళ్లు , అవినీతి , అలసత్వం నిండిన బ్యూరోక్రసీ సిస్టంలో ఇరుక్కొని ఎన్ని బాధలు పడ్డాడో తెలిపే హాస్యభరిత వ్యంగ చిత్రమే పైలం పిలగా. సాయి తేజ కల్వకోట, పావని కరణం జంటగా నటించారు.

ట్రైలర్ రిలీజ్ సందర్బంగా డైరెక్టర్ వెంకటేష్ మహా మాట్లాడుతూ.. ఈ చిత్ర దర్శకుడు ఆనందం గుర్రం రాసిన ‘ఊరెళ్ళిపోతా మావ ‘ , ‘కంచె లేని దేశం ‘ పాటలకు పెద్ద అభిమానిని, ఇప్పుడు ఈ సినిమాలో పాటలు కూడా చాలా చాలా బాగున్నాయి. సినిమా ట్రైలర్ చూస్తే తన పాటల్లాగే సినిమా కూడా అదే థాట్ ప్రాసెస్లో ఉండబోతోందని అర్థమౌతుంది, మంచి డైలాగ్స్ తో చాలా చాలా ఇంట్రెస్టింగా ఉంది, సినిమా టీం అందరిని అభినందిస్తూ, అందరు థియేటర్ కు వచ్చి ఈ విలేజ్ డ్రామాను ఎక్స్పీరియన్స్ చేయాలని అన్నారు .

నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, వంటి టాలీవుడ్, బాలీవుడ్ అగ్రనటులతో సహా వందకి పైగా యాడ్ ఫిలిమ్స్ కి దర్శకత్వం వహించిన ఆనంద్ గుర్రం దర్శకత్వం లో వస్తోన్న మొదటి చిత్రం ‘పైలం పిలగా’ విడుదలకు సిద్ధమవుతోంది. హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై రామకృష్ణ బొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం లో డబ్బింగ్ జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. యశ్వంత్ నాగ్ ఆరు అద్భుతమైన పాటలతో మెలోడియస్ సంగీతాన్ని అందించారు. కెమెరా సందీప్ బద్దుల, ఎడిటింగ్ రవితేజ, శైలేష్ దారేకర్, స్టైలిస్ట్ హారిక పొట్ట, లిరిక్స్ ఆనంద్ గుర్రం, అక్కల చంద్రమౌళి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సంతోష్ ఒడ్నాల పనిచేసిన ఈ చిత్రానికి రవి వాషింగ్టన్, కృష్ణ మసునూరి, విజయ్ గోపు సహా నిర్మాతలుగా వ్యవహరించారు.

Pailam Pilaga – Trailer | Sai Teja | Pavani Karanam | Anand Gurram | Yashwanth Nag