Pailam Pilaga Movie: హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ లో మొదటి చిత్రం ‘పైలం పిలగా’ ను రామకృష్ణ బొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించారు. డబ్బింగ్ జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. యశ్వంత్ నాగ్ ఆరు అద్భుతమైన పాటలతో మెలోడియస్ సంగీతాన్ని అందించారు. కెమెరా సందీప్ బద్దుల, ఎడిటింగ్ రవితేజ, శైలేష్ దరేకర్, స్టైలిస్ట్ హారిక పొట్ట, లిరిక్స్ ఆనంద్ గుర్రం, అక్కల చంద్రమౌళి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సంతోష్ ఒడ్నాల పనిచేసిన ఈ చిత్రానికి రవి వాషింగ్టన్, కృష్ణ మసునూరి, విజయ్ గోపు సహా నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా సెప్టెంబర్ 20న థియేటర్స్ లో విడుదల అయ్యింది. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆనంద్ గుర్రం తో స్పెషల్ ఇంటర్వ్యూ….
యాడ్ ఇండస్ట్రీ లో కాపీ రైటర్ గా ఉన్న నేను దాదాపు 100 యాడ్స్ చేశాను, తమ్స్ ఉప్, స్పైట్, ఫెవికల్, నెస్ లే, అమ్ ల్, వంటి యాడ్స్ కు కాపీ మరియు స్క్రిప్ట్ అందించాను. బాలయ్య తో సాయి ప్రియ కన్స్ట్రక్షన్, వెంకటేష్ మెడ్ ప్లస్ యాడ్స్ చేశాను.
బాలయ్య బెస్ట్ విషష్ తో పైలం పిలగా సెప్టెంబర్ 20న థియేటర్స్ లో !!!
రేడియో మిర్చిలో రైటర్ గా కొంతకాలం వర్క్ చేశాను, తరువాత కొన్ని షార్ట్ ఫిలింస్ చేశాను, అబ్దుల్ అనే షార్ట్ ఫిలిం కు అవార్డ్స్ వచ్చాయి. చౌరస్తా బ్యాండ్ కోసం కంచె లేని దేశం, ఊరెలిపోత మామ పాటలు రాశాను.
సినిమా పట్ల ఆసక్తితో నాతో యాడ్స్ చేస్తున్న హ్యాపీ హార్స్ బ్యానర్ లో ఒక మాంచి సినిమా చెయ్యాలని ఉద్దేశంతో పైలం పిలగా సినిమాకు దర్శకత్వం వహించడం జరిగింది. కమర్సియల్ కథ చెయ్యాలని కొంతమంది నిర్మాతలు నాతో చెప్పినప్పటికీ నేను ఒక హనెస్ట్ కథను చెప్పాలని ఈ సినిమాకు దర్శకత్వం వహించడం జరిగింది.
పైలం పిలగా ట్రైలర్ విడుదల, సెప్టెంబర్ 20న థియేటర్స్ లో చిత్రం విడుదల !!!
ఈ సినిమాలో సంగీతం హైలెట్… సెకండ్ హాఫ్ లో ఎక్కువ భాగం కథను పాటలతో సంగీతంతో కథను చెప్పడం జరిగింది. ప్రేక్షకులు చాలా కొత్తగా ఫీల్ అవుతున్నారు. సినిమా చూసిన అందరూ మంచి ప్రయత్నమని అంటున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ నుండి పైలం పిలగా సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. యూనిట్ సభ్యులు అందరి సహకారంతోనే ఈ సినిమా విజయం సాధించింది అని నమ్ముతున్నాను” అన్నారు.