Pailam Pilaga: అటు ప్రేక్షకుల నుండి ఇటు విమర్శకుల నుండి ప్రశంశలు దక్కించుకొని డీసెంట్ సక్సెస్ పొందిన ‘పైలం పిలగా’ సినిమాకు ఇప్పుడు ఓ టి టి లో కూడా విశేష స్పందన దక్కుతోంది. అక్టోబర్ 10 నుండి ఈటీవి విన్ ద్వారా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా, ఓ టి టి లో వచ్చే క్రైమ్, హారర్, అడల్ట్ కంటెంట్ కి భిన్నంగా పిల్లలు, పెద్దలు ఫామిలీ అంతా కలిసి కూర్చొని చూసే నీట్ అండ్ క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది.
Pailam Pilaga Movie Review: పైలం పిలగా మూవీ రివ్యూ & రేటింగ్ !!!
మెలోడియస్ పాటలు, ఆకట్టుకునే డైలాగ్స్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఈ సినిమా కథ గురించి చెప్పుకోవాలంటే….. తను పుట్టి పెరిగిన ఊళ్లోనే పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసి అంబాని లా ఎదగాలనుకునే ఒక పల్లెటూరి యువకుడి కథ. తన ప్రయాణంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ముఖ్యంగా ప్రభుత్వ అనుమతుల విషయంలో బ్యూరోక్రసీలో ఉండే రూల్స్ , ప్రభుత్వ అధికారుల అలసత్వం, అవినీతి వల్ల విలువైన సమయాన్ని, డబ్బును ఒక దశలో ప్రేమించిన వాళ్ళు కూడా దూరమై చివరకు తన కుటుంబం, తన ఊరు బాగు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేదే ఈ సినిమా.
Pailam Pilaga
పల్లెలు, ప్రకృతి, పర్యావరణం, వ్యవసాయం, ఉపాధి, వలసలు, ప్రభుత్వ ఉద్యోగుల అలసత్వం, లంచగొండితనం వంటి లోతైన అంశాలను సైతం హాస్యభరితంగా వ్యంగంగా మలచడంతో పాటు సెకండ్ హాఫ్ అంత ఒక మంచి మ్యూజికల్ నరేషన్లో భావోద్వేగాలు పండడం, ఊహించని క్లైమాక్స్ తో సినిమా మొదటి సీన్ నుండి చివరి సీన్ వరకు స్కిప్ చేయకుండా జనాలను స్క్రీన్ ముందు కూర్చోబెడుతుంది.
హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ లో ‘పైలం పిలగా’ ను యాడ్ ఫిలిం డైరెక్టర్ ఆనంద్ గుర్రం దర్శకత్వంలో రామకృష్ణ బొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించారు. డబ్బింగ్ జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సంగీతం యశ్వంత్ నాగ్, కెమెరా సందీప్ బద్దుల, ఎడిటింగ్ రవితేజ, శైలేష్ దరేకర్, స్టైలిస్ట్ హారిక పొట్ట, లిరిక్స్ ఆనంద్ గుర్రం, అక్కల చంద్రమౌళి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సంతోష్ ఒడ్నాల, సహా నిర్మాతలు రవి వాషింగ్టన్, కృష్ణ మసునూరి, విజయ్ గోపు.