Pailam Pilaga Movie Review: హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ లో మొదటి చిత్రం ‘పైలం పిలగా’ ను రామకృష్ణ బొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించారు. డబ్బింగ్ జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. యశ్వంత్ నాగ్ ఆరు అద్భుతమైన పాటలతో మెలోడియస్ సంగీతాన్ని అందించారు. కెమెరా సందీప్ బద్దుల, ఎడిటింగ్ రవితేజ, శైలేష్ దరేకర్, స్టైలిస్ట్ హారిక పొట్ట, లిరిక్స్ ఆనంద్ గుర్రం, అక్కల చంద్రమౌళి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సంతోష్ ఒడ్నాల పనిచేసిన ఈ చిత్రానికి రవి వాషింగ్టన్, కృష్ణ మసునూరి, విజయ్ గోపు సహా నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా సెప్టెంబర్ 20న థియేటర్స్ లో విడుదల అయ్యింది. సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం.
పైలం పిలగా ట్రైలర్ విడుదల, సెప్టెంబర్ 20న థియేటర్స్ లో చిత్రం విడుదల !!!
కథ:
సాయి తేజ కల్వకోట (శివ) దుబాయ్ వెళ్లి బాగా సెటిల్ అవ్వాలని అనుకుంటాడు. ఈ క్రమంలో శివ నాన్నమ్మ ఒక స్థలం ఉంది, ఇది అమ్మితే డబ్బు వస్తుంది, దుబాయ్ వెళ్ళవచ్చు అని చెబుతుంది. శివ తన స్నేహితుడు ప్రణవ్ సోను (శ్రీను) తో కలిసి స్థలం అమ్ముదామని అనుకుంటాడు. ఆ స్థలం లెటికేషన్ లో ఉంటుంది. ఈ క్రమంలో (పావని కారణం ) దేవిని శివ ప్రేమిస్తాడు, చివరికి శివ దేవిని వివాహం చేసుకున్నాడా ? శివ తాను దుబాయ్ వెళ్లాలనుకున్న ప్లాన్ ఏమయ్యింది ? వంటి విషయాలు తెలియాలంటే పైలం పిలగా సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
‘పిల్ల పిలగాడు’ వెబ్ సిరీస్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సాయి తేజ హీరో గా, పుష్ప , పరేషాన్ చిత్రాలతో వెలుగులోకి వచ్చిన పావని కరణం హీరోయిన్ గా, యాడ్ ఫిలిం మేకర్ ఆనంద్ గుర్రం దర్శకత్వంలో తెరకెక్కింది. మంచి పాటలు, ఎంటర్టైనింగ్ కామెడీ, ఎంగేజింగ్ మ్యూజిక్ సినిమాను నిలబెట్టాయి.
Pailam Pilaga Movie: పైలం పిలగా డైరెక్టర్ ఆనంద్ గుర్రం ఇంటర్వ్యూ….
పైసాను ప్రేమించే పిలగాడు, ప్రకృతిని ప్రేమించే పిల్ల. మేఘాల్లో మేడలు కట్టుకోవాలని కలలు కనే మొనగాడు, చెట్టు కింద చిన్న గూడు చాలు అనుకునే అమ్మాయి మధ్య చిగురించిన ప్రేమ ఒకవైపు, ఎక్కడికైనా సరే, ఎంత దూరమైనా సరే వెళ్లి కోట్లు సంపాదించి తన ఊళ్ళో కింగ్ అనిపించుకోవాలనే ఆరాటం ఇంకోవైపు, ఈ ఈస్ట్ వెస్ట్ సంఘర్షణని వినోదాత్మకంగా తెలిపే హాస్యభరిత వ్యంగ చిత్రం ‘పైలం పిలగా’.
డైరెక్టర్ ఆనంద్ గుర్రం రాసుకున్న కథ కథనాలు బాగున్నాయి. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అంశాలను కళ్ళకు కిట్టినట్లు చూపించారు. మొదటి ప్రయత్నంతోనే సక్సెస్ సాధించారు. మ్యూజిక్ డైరెక్టర్ యస్వత్ నాగ్ సంగీతం ఈ సినిమాకు మరో హైలెట్. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా పైలం పిలగా
రేటింగ్: 3/5