‘ఊరు పేరు భైరవకోన’ టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సందీప్ కిషన్ & టీమ్

ప్రామిసింగ్ యంగ్ హీరో సందీప్ కిషన్, టాలెంటెడ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ ల ఫాంటసీ అండ్ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఊరు పేరు భైరవకోన’ విడుదలకు సిద్ధమవుతోంది. హాస్య మూవీస్ బ్యానర్ ‌పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఏకె ఎంటర్ ‌టైన్ ‌మెంట్స్ బ్యానర్‌ పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. నిజమే నే చెబుతున్న ఫస్ట్ సింగిల్‌ కి అద్భుతమైన స్పందన రావడంతో మ్యూజిక్ ప్రమోషన్ ‌లు చార్ట్‌ బస్టర్ నోట్ ‌లో ప్రారంభమయ్యాయి. ఈరోజు మేకర్స్ టీజర్ ‌ను లాంచ్ చేశారు.

శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఉన్న గరుడ పురాణం లోని నాలుగు పేజీలు కనిపించకుండా పోయాయని వివరించే పవర్ ఫుల్ వాయిస్‌ ఓవర్ ‌తో టీజర్ ప్రారంభమవుతుంది. భైరవ కోన అని పిలవబడే ఈ ఫాంటసీ ప్రపంచంలోకి రావడమే తప్పితే, బయటికి పోవడం వుండదు. హీరో సమాధానాలు వెతకడానికి అక్కడికి చేరుకుంటాడు.

కథ కొత్తగా, కథనం ఎంగేజింగ్ గా వుంది. ఫాంటసీ సబ్జెక్ట్‌ లను అందించడం దిట్టయిన విఐ ఆనంద్ భైరవకోనని అద్భుతంగా ర్చిదిద్దారు. సందీప్ కిషన్ యాక్షన్ అవతార్ లో కనిపించాడు. రాజ్ తోట అందించిన సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది, శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విజువల్స్ ని ఎలివేట్ చేసింది. ప్రొడక్షన్ విలువలు అత్యున్నతం గా ఉన్నాయి. టీజర్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది.

వర్షా బొల్లమ్మ, కావ్య థాపర్‌ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి చోటా కె ప్రసాద్‌ ఎడిటర్‌ గా, ఏ రామాంజనేయులు ఆర్ట్‌ డైరెక్టర్ ‌గా వ్యవహరిస్తున్నారు. భాను భోగవరపు, నందు సవిరిగాన ఈ చిత్రానికి డైలాగ్స్ అందించారు.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. బర్త్ డే రోజు టీజర్ విడుదల కావడం స్పెషల్ మూమెంట్. తొలిసారి చండీయాగం చేసి టీజర్ విడుదల చేయడం చాలా పాజిటివ్ గా వుంది. రాజ్ తోట గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, ఎడిటర్ చోటా కే ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ ఏ రామాంజనేయులు అందరూ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మొదటి పాటకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజేష్ దండా తో సినిమా చేయడం ఆనందంగా వుంది. ఆనంద్ నాకు మంచి స్నేహితుడు. ‘ఊరు పేరు భైరవకోన’ లాంటి సినిమా నాతో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో చాలా మంచి విషయాలు, వినోదాత్మక విషయాలు వుంటాయి. ఇలాంటి ఫాంటసీ అడ్వెంచర్ సినిమాలు నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఇందులో నాకు ,హర్ష కి కెమిస్ట్రీ ఎక్స్ టార్డినరిగా వుంటుంది. వర్ష బొల్లమ్మ, కావ్య.. ఇలా అందరూ చాలా చక్కగా నటించారు. ఈ సినిమాకి అన్నిటికన్నా బాగా కుదిరిన విషయం.. అనిల్ గారు. నాకు ఎప్పుడూ తోడుండేది అనిల్ గారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అనిల్ గారు లేకపోతే ఈ సినిమా ఇక్కడి వరకూ వచ్చేది కాదు. టీజర్ మీ అందరికి నచ్చడం ఆనందంగా వుంది. మీ సహకారం ఆశీస్సులు నాకు కావాలి’’ అన్నారు.

విఐ ఆనంద్ మాట్లాడుతూ.. టైగర్ సినిమా నాకో గుర్తింపునిచ్చింది. సందీప్ నమ్మకం వలనే ఆ సినిమా సాధ్యమైయింది. అక్కడి నుంచి మా స్నేహం మొదలైయింది. మళ్ళీ కలసి సినిమా చేస్తే ఇంకా గ్రాండ్ ఉండాలని అనుకునేవాళ్ళం. సందీప్ పుట్టినరోజు సందర్భంగా ‘ఊరు పేరు భైరవకోన’ టీజర్ రిలీజ్ కావడం ఆనందంగా వుంది. ‘ఊరు పేరు భైరవకోన’ యూనిక్ కాన్సెప్ట్. అదే సమయంలో ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ వుంటుంది. సూపర్ నేచురల్ ఫాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయి. నిర్మాత రాజేష్ గారు ఎక్కడా రాజీ పడకుండా పూర్తి సహకారం అందించారు. అనిల్ మొదటి నుంచి నన్ను ప్రోత్సహిస్తున్నారు. వర్ష బొల్లమ్మ, కావ్య చక్కగా నటించారు. అలాగే వైవా హర్ష పాత్ర కూడా ఇందులో కీలకంగా వుంటుంది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర , రాజ్ తోట, ఛోటా కె ప్రసాద్.. ఇలా వండర్ ఫుల్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. చాలా కొత్తగా ప్రయత్నించాం. మీ అందరి సహకారం కావాలి’’ అన్నారు

అనిల్ సుంకర మాట్లాడుతూ.. సందీప్ కి హ్యాపీ బర్త్ డే. సందీప్ తో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. టీజర్ సందీప్ కి బర్త్ డే గిఫ్ట్ లా వుంటుంది. అలాగే బ్లాక్ బస్టర్ గిఫ్ట్ కూడా ఈ సినిమా అవుతుంది. ఈ సినిమా సందీప్ కి మెమరబుల్ గిఫ్ట్ అవుతుంది. ఇది నా ప్రామిస్. యూనిట్ అంతా చాలా కష్టపడి చేశారు. దర్శకుడు చెప్పిన దానిలో 70 శాతం విజువల్ వుంటే అది బ్లాక్ బస్టర్ అవుతుంది. కానీ ఆనంద్ గారు చెప్పిన దాని కంటే 50 శాతం ఎక్కువ విజువల్ వుంటుంది. విజువల్ చూసి చాలా ఆశ్చర్యపోయాను. ప్రేక్షకులు కూడా చాలా సర్ప్రైజ్ అవుతారు’’ అన్నారు,

కావ్య థాపర్ మాట్లాడుతూ.. సందీప్ గారికి వెరీ హ్యాపీ బర్త్ డే. టీజర్ మీ అందరి తో పంచుకోవడం ఆనందంగా వుంది. ఇప్పటికే ప్రమోషనల్ మెటీరియల్ కి మంచి స్పందన వస్తోంది. త్వరలోనే మరింత ఎక్సైటింగ్ కంటెంట్ మీ ముందుకు తీసుకోస్తాం. ఆనంద్ గారికి, మిగతా టీం అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.

నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ.. సందీప్ గారికి హ్యాపీ బర్త్ డే. మహాచండీ యాగంతో టీజర్ లాంచ్ చేయడం ఇండస్ట్రీలో ఇదే తొలిసారి. ఈ ఆలోచన ఇచ్చిన హీరో సందీప్ కిషన్ గారికి కృతజ్ఞతలు. విఐ ఆనంద్, సందీప్ కిషన్, అనిల్ గారు నేను .. ఇలా నలుగురు స్నేహితులం కలసి సినిమా చేయాలనే ఆలోచనతో ఈ సినిమా మొదలైయింది. భారీ స్థాయిలో ఆనంద్ గారి స్టైల్ లో సూపర్ నేచురల్ ఫాంటసీ గా ఈ సినిమా వస్తుంది. ఈ టీజర్ చూసి సినిమా రేంజ్ ఏమిటనేది మీరే చెప్పాలి. అనిల్ గారు చాలా మంచి సూచనలు సలహాలు ఇచ్చారు. ఆయనకి కృతజ్ఞతలు.’’ తెలిపారు.

తారాగణం: సందీప్ కిషన్, కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ తదితరులు

సాంకేతిక విభాగం:
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: విఐ ఆనంద్
సమర్పణ: అనిల్ సుంకర
నిర్మాత: రాజేష్ దండా
సహ నిర్మాత: బాలాజీ గుత్తా
బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్
సంగీతం: శేఖర్ చంద్ర
డీవోపీ: రాజ్ తోట
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: ఎ రామాంజనేయులు
డైలాగ్స్: భాను భోగవరపు, నందు సవిరిగాన
పీఆర్వో: వంశీ-శేఖర్