Good Bad Ugly: మైత్రి మూవీ మేకర్స్ ప్రౌడ్లీ ప్రజెంట్స్ అజిత్ కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తెలుగు టీజర్ రిలీజ్

ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, కోలీవుడ్ ఐకాన్ అజిత్ కుమార్‌ను తమ మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్ట్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో తెలుగు సినిమాకు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. టి-సిరీస్‌ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ హై-ప్రొఫైల్ మూవీ ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఈ చిత్రం తమిళ టీజర్ నిన్న విడుదలై 30 మిలియన్లకు పైగా వ్యూస్ తో అదరగొట్టింది. ఈ రోజు మేకర్స్ తెలుగు టీజర్ రిలీజ్ చేశారు.

ఈ టీజర్ అజిత్‌ను నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో అద్భుతంగా ప్రజెంట్ చేసింది. అతని పాత్ర ఎకె ‘ రెడ్ డ్రాగన్’ డెడ్లీ, వైలెన్స్ వరల్డ్ ని పరిచయం చేసింది. “నువ్వు ఎంత మంచివాడివైనా, ప్రపంచం నిన్ను చెడుగా మార్చేస్తుంది” ఈ డైలాగ్ యాక్షన్-ప్యాక్డ్ నెరెటివ్ కి టోన్ సెట్ చేసింది. AK తన నిజాయితీతో ఎంత పోరాడినా, అతని చుట్టూ ఉన్న శక్తులు అతన్ని చీకటి, ప్రమాదకరమైన ప్రపంచంలోకి నెట్టివేస్తాయని చూపిస్తుంది.

టీజర్‌లో అద్భుతమైన విజువల్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ అజిత్ అభిమానులను కట్టిపడేశాయి. అజిత్ రెడ్ డ్రాగన్ క్యారెక్టరైజేషన్ మెస్మరైజ్ చేస్తోంది.

అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది, GV ప్రకాష్ కుమార్ నేపధ్య సంగీతం ఎక్సయిటమెంట్ ని మరింత పెంచుతుంది. అజిత్ క్యారెక్టర్ లో వైవిధ్యమైన కోణాలు అతని పాత్రను మరింత ఆసక్తిని రేపాయి.

ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్ దాస్, ప్రసన్న, సునీల్ ,ప్రభు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

అద్భుతమైన యాక్షన్, పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ లతో గుడ్ బ్యాడ్ అగ్లీ ఆడియన్స్ గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని ఇవ్వబోతుందని ఈ బ్లాస్టింగ్ టీజర్ ప్రామిస్ చేస్తోంది

నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఇండియన్ సినిమాలో ఒక ల్యాండ్‌మార్క్ చిత్రంగా నిలుస్తుందని హామీ ఇచ్చింది. ఈ సినిమా ఎడిటింగ్‌ను విజయ్ వేలుకుట్టి నిర్వహించగా, జిఎం శేఖర్ ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షిస్తున్నారు.

టీజర్ తో భారీ అంచనాలు నెలకొల్పిన ఈ చిత్రం ఏప్రిల్ 10న వేసవిలో విడుదల కానుంది.

తారాగణం: అజిత్ కుమార్, త్రిష కృష్ణన్, ప్రభు, ప్రసన్న, అర్జున్ దాస్, సునీల్

సాంకేతిక సిబ్బంది
రచన, దర్శకత్వం: అధిక్ రవిచంద్రన్
డీవోపీ: అభినందన్ రామానుజం
సంగీతం : జివి ప్రకాష్ కుమార్
ఎడిటర్: విజయ్ వేలుకుట్టి
ప్రొడక్షన్ డిజైనర్: జి ఎం శేఖర్
స్టంట్స్: సుప్రీం సుందర్, కలోయన్ వోడెనిచరోవ్
స్టైలిస్ట్: అను వర్ధన్ / రాజేష్ కమర్సు
పీఆర్వో : సురేష్ చంద్ర
పీఆర్వో (తెలుగు) : వంశీ శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
మార్కెటింగ్ (తమిళం) : డి’వన్
సౌండ్ డిజైన్: సురేన్
స్టిల్స్ : జి ఆనంద్ కుమార్
పబ్లిసిటీ డిజైన్స్ : ADFX స్టూడియో
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దినేష్ నరసింహన్
CEO: చెర్రీ
నిర్మాతలు: నవీన్ యెర్నేని-వై రవిశంకర్
సమర్పణ: గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, T సిరీస్
సహ నిర్మాత: శివ్ చన్నా
ప్రెసిడెంట్ (టి సిరీస్): నీరజ్ కళ్యాణ్

Ap Assembly Budjet : Public EXPOSED Pawan Kalyan & Chandrababu || Ys Jagan || Ap Public Talk || TR