‘మంత్ ఆఫ్ మధు” ఫీల్ గుడ్ మూవీ: ఎం.ఎం కీరవాణి

నవీన్ చంద్ర, స్వాతిరెడ్డి ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘మంత్ ఆఫ్ మధు”. విమర్శకుల ప్రశంసలు పొందిన భానుమతి & రామకృష్ణ చిత్రాన్ని అందించిన దర్శకుడు శ్రీకాంత్ నాగోతి ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించగా, యశ్వంత్ ములుకుట్ల క్రిషివ్ ప్రొడక్షన్స్, హ్యాండ్‌పిక్డ్ స్టోరీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సుమంత్ దామ సహ నిర్మాతగా, రఘువర్మ పేరూరి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆస్కార్ విజేత ఎం.ఎం కీరవాణి, హీరో సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిధులుగా హాజరైన ఈ ప్రీరిలీజ్ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. దర్శకుడు శ్రీకాంత్ నాగోతి నవీన్ తో చేసిన భానుమతి & రామకృష్ణ కి చాలా మంచి పేరు వచ్చింది. ఐతే ఆ చిత్రానికి ఇంకా పేరు రావాల్సిందని నాకు అనిపించింది. ఇప్పుడు మంత్ ఆఫ్ మధు చిత్రం కూడా యూనివర్సల్ గా వుంటుంది. ఈ మధ్య కాలంలో చూసిన బెస్ట్ ట్రైలర్ మంత్ ఆఫ్ మధు. అన్ని సినిమాలు వేరు ఈ సినిమా వేరని ట్రైలర్ లోనే తెలుస్తుంది. శ్రేయాకి ఆల్ ది బెస్ట్. స్వాతికి నాకు ఓ కామన్ పోలిక వుంది. నాకూ పన్నుమీద పన్ను వుంటుంది. కొంతమంది నన్ను స్వాతితో పోలుస్తారు(నవ్వుతూ). హర్ష కూడా చాలా కీలక పాత్రలో కనిపిస్తున్నారని అర్ధమౌతుంది. రవికాంత్ ఎడిటింగ్ చాలా బావుంది. అచ్చు చేసిన పాటలన్నీ చాలా బావున్నాయి. నవీన్ నాకు ఎప్పటినుంచో మంచి స్నేహితుడు. ఇందులో తన నటన అద్భుతంగా వుంటుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుంది. చాలా మంచి టీం కలిసి చేసిన సినిమా ఇది. అందరూ తప్పకుండా థియేటర్స్ లో చూడాలి” అని కోరారు.

ఎం.ఎం కీరవాణి మాట్లాడుతూ.. మంత్ ఆఫ్ మధు ట్రైలర్ చూసినప్పుడు ఫీల్ గుడ్ మూవీ అనిపించింది. నటీనటులు, టేకింగ్, నేపధ్య సంగీతం ఇవన్నీ బావున్నాయి. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకుల మనసుని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ సినిమాకి మ్యూజిక్ చేసిన అచ్చు గురించి చెప్పాలంటే.. అచ్చులో ఎనర్జీ, ఇన్నోవేషన్ రెండూ సమపాళ్లలో వున్నాయి.అచ్చు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నేను వాళ్ళ నాన్న గారి దగ్గర పని చేశాను. డిసెంబర్ 9 అచ్చు బర్త్ డే. నేను మొదటి పాట రికార్డ్ చేసింది కూడా అదే రోజు. అలా అచ్చుతో నాకు అనుబంధం వుంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ మంచి పేరుతో పాటు డబ్బు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను.

హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. మంత్ ఆఫ్ మధు చాలా స్పెషల్ మూవీ. ఇలాంటి పాత్రలు, సినిమాలు అరుదుగా వస్తుంటాయి. శ్రీకాంత్ తో వర్క్ చేయడం ఇది రెండోసారి. నేను ఈ పాత్ర చేస్తానని బలంగా నమ్మాడు. భవిష్యత్ లో మరిన్ని సినిమాలు కలిసి చేస్తాం. నిర్మాత యష్ ఈ చిత్రానికి వెన్నెముక. రవికాంత్ అద్భుతంగా ఎడిట్ చేశారు. ఆయన దర్శకత్వంలో పని చేయాలని వుంది. హర్ష లాంటి ఫ్రెండ్ నిజ జీవితంలో వుండాలి. ఈ చిత్రంలో అద్భుతంగా చేశాడు. అచ్చు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అక్టోబర్ 6న ఈ మ్యాజిక్ చూస్తారు. శ్రేయా అద్భుతంగా చేసింది. కథని మరో స్థాయికి తీసుకెళ్ళింది. స్వాతిది చాలా మంచి మనసు. ఇందులో స్వాతి లాంటి పాత్రని చేయాలంటే చాలా ధైర్యం కావాలి. తన పాత్ర కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. తన లాంటి ఫ్రెండ్ వుండాలి. తనతో మరిన్ని చిత్రాలు చేయాలని వుంది. టీం అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. సిద్దుకి నేను ఫ్యాన్ ని. డిజే టిల్లుని ఎన్నోసార్లు చూశాను. తను ఈ వేడుకకి రావడం ఆనందంగా వుంది” అన్నారు.

స్వాతి రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సినిమాకి లెక్కలు వుంటాయి. మా సినిమాకి పాత్రలకి సర్కిల్స్ వుంటాయి. ప్రతి పాత్రకు ఒక కంప్లీట్ సర్కిల్ వుంటుంది. ప్రతి పాత్ర ఒక గౌరవంతో వుంటుంది. అచ్చు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. శ్రేయా చాలా చక్కగా నటించింది. ఈ సినిమా చూసిన తర్వాత అందరూ పాత్రలనే గుర్తుపెట్టుకుంటారు. డైలాగులు గుర్తుంటాయి. తప్పకుండా అందరూ అక్టోబర్ 6న థియేటర్స్ లో మంత్ ఆఫ్ మధు చూడండి” అని కోరారు.

శ్రీకాంత్ నాగోతి మాట్లాడుతూ.. సిద్దు జొన్నలగడ్డ ఈ వేడుక రావడం చాలా ఆనందంగా వుంది. రవికాంత్ చాలా అద్భుతంగా ఎడిట్ చేశారు. శ్రేయా.. ప్రస్తుతానికి నా పందెం గుర్రం. నా పందెం గుర్రంపై పందెం కాస్తున్నాను. తను ఎంత అద్భుతంగా చేసిందో సినిమా లో చూస్తారు. నవీన్ ప్రతి షాట్ లో సర్ ప్రైజ్ చేస్తారు. అచ్చు అద్భుతమైన మ్యూజిక్ చేశారు. మంత్ ఆఫ్ మధుని ప్యాషన్ తో తీశాం. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది” అన్నారు.

నిర్మాత యశ్వంత్ మాట్లాడుతూ.. ఎం.ఎం కీరవాణి గారికి , హీరో సిద్దు జొన్నలగడ్డ గారి ధన్యవాదాలు. మీ అందరూ మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేశారు. అక్టోబర్ 6 ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని చాలా నమ్మకంగా వున్నాం” అన్నారు.

శ్రేయా మాట్లాడుతూ.. లీడ్ క్యారెక్టర్ లో ఇది నా మొదటి సినిమా. నేను అమెరికాలో పుట్టిపెరిగాను. కానీ ఇండియన్ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు.నవీన్, స్వాతి లాంటి స్టార్స్ తో నటించడం ఆనందంగా వుంది, చాలా నిజాయితీగా ప్రేమతో తీసిన సినిమా ఇది. ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని ప్రేమిస్తారనే నమ్మకం వుంది” అన్నారు. ఈ వేడుకలో రవికాంత్, హర్ష, జ్ఞానేశ్వరి, రఘు, రాజీవ్, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.