Mana Shankara Vara Prasad Garu First Single: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’ టాప్ ట్రెండ్ 17 మిలియన్‌+ వ్యూస్

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’ మ్యూజిక్ వరల్డ్ ని షేక్ చేస్తోంది. చిరంజీవి మాస్ అండ్ క్లాస్ కాంబినేషన్‌ని ప్రజెంట్ చేసిన ఈ పాట రికార్డుల వర్షం కురిపిస్తోంది.

‘హిట్ మెషీన్’ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మ్యూజికల్ ఫీస్ట్‌లో చిరంజీవి తన యంగ్ ఎనర్జీ, మ్యాజికల్ డ్యాన్స్ మూవ్స్ తో అదరగొట్టారు. నయనతారతో ఆయన కెమిస్ట్రీ స్క్రీన్‌పై చూడముచ్చటగా వుంది.

భీమ్ సీసిరోలియో స్వరపరిచిన ఈ పాటలో ఎలక్ట్రానిక్ బీట్స్‌, సింథ్ సౌండ్స్‌, ట్రెడిషనల్ పెర్కషన్ మేళవింపు అద్భుతంగా ఉంది. భాస్కరభట్ల సాహిత్యం చిలిపితనం, సరదా, ఫన్ తో ఆకట్టుకుంది. ఉదిత్ నారాయణ్ వాయిస్‌లోని నాస్టాల్జిక్ టచ్‌, శ్వేతా మోహన్ వాయిస్‌లోని ఎలిగెన్స్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

రిలీజ్‌ అయిన రెండురోజుల్లోనే ‘మీసాల పిల్ల’ 17 మిలియన్‌కి పైగా వ్యూస్ సాధించి దేశవ్యాప్తంగా టాప్ ట్రెండ్‌గా కోంసగుతోంది. ఇది చిరంజీవి పాన్-ఇండియా క్రేజ్‌కి నిదర్శనం.

షైన్ స్క్రీన్స్‌, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్‌, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్.

‘మీసాల పిల్ల’ ఇచ్చిన సూపర్ స్టార్ట్‌తో ఈ సీజన్‌లో మరిన్ని మెగా చార్ట్‌బస్టర్స్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. చిరంజీవి ఎవర్ గ్రీన్ చరిష్మా, సినిమాటిక్ వైబ్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

Dasari Vignan: What Happened Jr.NTR? | Telugu Rajyam