గోపీచంద్, శ్రీను వైట్ల, #Gopichand32 కొత్త షెడ్యూల్ మార్చి 27 నుండి ప్రారంభం

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #గోపీచంద్32 ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి యొక్క తొలి ప్రొడక్షన్ వెంచర్. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై అత్యున్నత స్థాయి ప్రొడక్షన్ , సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా కోసం చిత్రాలయం స్టూడియోస్‌తో కలిసి పని చేస్తుంది. టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా చేరారు.

ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ రేపు (మార్చి 27న) ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో, ప్రధాన తారాగణంతో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దీంతో టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది.

నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ – ”పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాంటి పెద్ద బ్యానర్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. విశ్వప్రసాద్ గారికి ధన్యవాదాలు. సినిమా చాలా అద్భుతంగా వస్తోంది. 27 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. శ్రీను వైట్ల మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఈ సినిమాకి ఒక యూనిక్ పాయింట్ వుంది. ఈ సినిమాతో శ్రీను వైట్ల స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తున్నారు. గోపీచంద్, శ్రీనువైట్ల కాంబోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది” అన్నారు

ఈ సినిమాలో గోపీచంద్‌ని కొత్త అవతార్ లో శ్రీను వైట్ల ప్రెజెంట్ చేస్తున్నారు. శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. కెవి గుహన్ డీవోపీగా చేస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేస్తారు.

నటీనటులు: ‘మాచో స్టార్’ గోపీచంద్

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: శ్రీను వైట్ల
నిర్మాతలు: వేణు దోనేపూడి, టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్లు: చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
స్క్రీన్ ప్లే: గోపీ మోహన్
సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్
సంగీతం: చైతన్ భరద్వాజ్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో