Ghaati: ఘాటి: పుష్ప, శీలావతి క్రాస్ఓవర్‌ను రెండు పార్ట్స్‌గా చేద్దాం: అనుష్క శెట్టితో ఫోన్ కాల్‌లో అల్లు అర్జున్

క్వీన్ అనుష్క శెట్టి మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఘాటి రేపే రిలీజ్‌ అచుతుంది. అనుష్క వర్చువల్‌ ప్రమోషన్స్ లో ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఫోన్ కాల్ లో మాట్లాడారు.

‘వేదం’,‘రుద్రమదేవి’ సినిమాలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ఇద్దరు స్టార్స్, ఫోన్‌లో కూల్‌గా మోమోరిస్ ని రీఫ్రెష్ చేసుకున్నారు. అనుష్క మాట్లాడుతూ.. “నా కెరీర్‌లో చేసిన చాలెంజింగ్ రోల్స్ బన్నీ ఏదో ఒక రూపంలో పార్ట్ అయ్యారు. ఇప్పుడు ఘాటీ కోసం ఫోన్ కాల్ సర్ ప్రైజ్.

ఘాటిలో తన పాత్ర గురించి మాట్లాడుతూ..“ఈ రోల్ కేవలం యాక్షన్ మాత్రమే కాదు… ఎమోషన్స్ కూడా చాలా ఉన్నాయి. క్రిష్ నన్ను కంప్లీట్‌గా కమ్ఫర్ట్‌జోన్‌కి బయటికి తెచ్చి వర్క్ చేయించారు.

అల్లు అర్జున్ వెంటనే రియాక్ట్ అయ్యి.. “అనుష్క… నువ్వు ఓ గ్రేట్ లీగ్‌లో ఉన్నావ్. నేటి హీరోయిన్స్‌లో ఇలా యాక్షన్ రోల్స్ ఎవరూ చేయరు.

అంతలో బన్నీ ఓ క్రియేటివ్ ఐడియా కూడా ఇచారు. “పుష్ప, శీలావతి క్రాస్‌ఓవర్ చేస్తే బాగుంటుంది కదా? రెండు పార్ట్స్‌గా చేద్దాం. ఒకటి సుకుమార్, మరొకటి క్రిష్ డైరెక్ట్ చేస్తే అద్భుతంగా వుంటుంది.

దానికి అనుష్క అందుకు ముందు నేను పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించాలి” అని చెప్పేసరికి, బన్నీ వెంటనే రియాక్ట్ అయ్యి.. నువ్వు ఇప్పటికే పాన్ ఇండియా స్టార్… బాహుబలి దానికి ప్రూఫ్ అయ్యింది’అన్నారు

ఫైనల్ గా బన్నీ ఘాటిని తన ఫ్యామిలీతో చూసే ప్లాన్ చెబుతూ, అనుష్కకి, మూవీ టీమ్‌కి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.

ఇద్దరి స్టార్స్ మధ్య జరిగిన ఈ స్పాంటేనియస్ కన్‌వర్సేషన్ ఘాటి రిలీజ్ మీద ఎక్సైట్‌మెంట్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది.