బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాని కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం ‘డంకీ’. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం గురువారం (డిసెంబర్ 21) రోజున గ్రాండ్ రిలీజైంది. తొలిసారి షారూక్, రాజ్‌కుమార్ హిరాని కాంబోలో వచ్చిన సినిమా కావటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోను ముంబైలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ గైటీ గెలాక్సీలో ఉదయం 5 గంటల 55 నిమిషాలకు ప్రారంభించారు. థియేటర్ ముందు షారూక్ ఖాన్ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. తొలి ఆట కావటంతో డోలు, బాణా సంచాలతో వచ్చిన ఫ్యాన్స్, ప్రేక్షకులు సందడి చేశారు. థియేటర్‌లో ఓ పండుగ వాతావరణాన్ని సృష్టించారు. థియేటర్‌లో చేసిన హంగామాకు సంబంధించిన వీడియోను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
వీడియోను గమనిస్తే డోలు కొడుతూ, బాణా సంచా కాల్చుతూ షారూక్ ఫ్యాన్స్ చేసిన సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే. కొందరైతే విమానం తరహా కటౌట్స్‌తో కనిపించారు. వాటిపై డంకీ అని కూడా రాసి ఉంది. బాణా సంచా కాల్చటానికి చిన్నపాటి అరెంజ్‌మెంట్‌ను చేశారు. ఇక థియేటర్ బయట అభిమానులు డాన్సులు చేశారు. వారి ఆనందం చూస్తుంటే డంకీ సినిమా కోసం వారెంతో ఆతృతగా ఎదరురు చూశారనే విషయం స్పష్టమవుతుంది.
https://x.com/iamsrk/status/1737624014255001741?s=46&t=PusltWkTns46RNMqjWxAeA
https://x.com/srkuniverse/status/1737619382187262274?s=46&t=PusltWkTns46RNMqjWxAeA
https://x.com/srkuniverse/status/1737628937893945785?s=46&t=PusltWkTns46RNMqjWxAeA
https://x.com/srkuniverse/status/1737627311779008718?s=46&t=PusltWkTns46RNMqjWxAeA
వీడియో చూసిన తర్వాత కింగ్ ఖాన్ షారూక్ సైతం స్పందించారు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలను రీపోస్ట్ చేసిన షారూక్ ‘‘అందరికీ ధన్యవాదాలు. సినిమాను చూసి అందరూ ఎంజాయ్ చేయండి. కచ్చితంగా డంకీతో మీరు సంతోషాన్ని పొందుతారు’’ అని అన్నారు బాలీవుడ్ బాద్షా. డంకీ సినిమాను చూడటానికి న్యూజిలాండ్ నుంచి వచ్చిన అభిమానులు ఎంజాయ్ చేశారు. సినిమా చాలా బావుందంటూ రివ్యూస్ వస్తున్నాయి.
‘డంకీ’ చిత్రంలో టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను మెప్పించనున్నారు. బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ సహా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటారనటంలో సందేహం లేదు. ఏ జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యానర్స్ సమర్పణలో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, కణిక థిల్లాన్ ఈ చిత్రానికి రచయితలు. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబర్ 21న రిలీజైంది.