హరే కృష్ణ ! ఇస్కాన్ ద్వారా భగవద్గీత గొప్పదనాన్ని చెప్పే సినిమా “డివైన్ మెసెజ్ 1”

ఏదైనా ఒక విషయాన్ని చాలా డీప్ గా చెప్పాలన్నా , చాలా ఎక్కువ మందికి తెలిసేలా చెప్పాలన్నా దానికి చాలా మంది సినిమాని మాధ్యమంగా వాడుకుంటూ ఉంటారు. అందుకే సినిమా దర్శకులు ఎక్కువగా ఒక మెసేజ్ ని తన సినిమా ద్వారా ప్రేక్షకులకు చెప్పాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

వాళ్ళ భావాలను సినిమా ద్వారా ప్రేక్షకులకు తెలిసేలా చేస్తారు. ఇక సమాజానికి మంచి చేసే సినిమాలు చూసి మారిన వారు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇస్కాన్ వారు కూడా భగవద్గీత యొక్క గొప్పతనాన్ని ఈ జనరేషన్ లో ఉన్న వారికి తెలియజేయాలనే ఒకే ఒక ఉద్దేశ్యంతో ఒక సినిమాని రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం ముందుగా ఒక షార్ట్ ఫిలిం ని తెరకెక్కించాలని ప్రయత్నం చేశారు.

ఇక అందులో భాగం గానే ప్రముఖ దర్శకుడు అయిన ‘సంతోష్ జాగర్ల పూడి’ కి ఈ షార్ట్ ఫిలిం “డివైన్ మెసెజ్ 1” ని తెరకెక్కించే బాధ్యతని అప్పగించారు. ఇక దీనికి కథ ‘సచినందన్ హరిదాస్’ అందించారు. సీతారాం ప్రభు గారి నేతృత్వంలో హైదరాబాద్ ,అత్తాపూర్ ‘ఇస్కాన్ ‘ఆలయంలో దీనిని చిత్రీకరించారు .

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ షార్ట్ ఫిలిం పేరు డివైన్ మెసెజ్ 1 గా నిర్ణయించారు… దీనిని త్వరలోనే అమెజాన్ తో సహా అన్ని ఓటిటి ప్లాట్ఫారమ్స్ లో అందుబాటులో ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

ఇస్కాన్ ద్వారా సంతోష్ జాగర్లపూడి లాంటి ఒక క్రియేటివ్ డైరెక్టర్ గారికి ఈ సినిమా చేయమని చెప్పడం అనేది నిజంగా అతని యొక్క ప్రతిభకు కొలమానమనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన సుమంత్ హీరోగా మహేంద్ర గిరి వారాహి అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినీమా చిత్రించడానికి సహకరించిన హైదరాబాద్ లోని ఇస్కాన్ అత్తాపూర్ టెంపుల్ మేనేజ్మెంట్ కు చిత్రబృందం కృతజ్ఞతలు తెలియచేసింది.