బి సుమంత్‌ చిత్రం ‘మహేంద్రగరి వారాహి’

రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ప్రొడక్షన్‌ నెంబర్‌ 2 చిత్రానికి టైటిల్‌ ఖరారు చేశారు. రాజశ్యామలా అమ్మవారి నిత్య ఉపాసకులు, విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి సమక్షంలో ఈ చిత్రానికి ‘మహేంద్రగిరి వారాహి’అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. ఈ మేరకు చిత్ర బృందం విశాఖ శారదాపీఠాన్ని సందర్శించింది.

హీరో సుమంత్‌ , హీరోయిన్‌ విూనాక్షి, చిత్ర దర్శకుడు జాగర్లపూడి సంతోష్‌.. నిర్మాతలు కాలిపు మధు, ఎం సుబ్బారెడ్డి తదితరులు రాజశ్యామల అమ్మవారి ఆలయంలో పూజలు చేసి, పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములను కలిశారు. రాజశ్యామల అమ్మవారితో వారాహి అమ్మవారికి ఉన్న అనుబంధం గురించి చిత్ర బృందం స్వాత్మానందేంద్ర స్వామిని అడిగి తెలుసుకుంది.

ఈ సందర్భంగా దర్శకుడు జాగర్లపూడి సంతోష్‌ మాట్లాడుతూ.. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నాం. మహేంద్రగిరి వారాహి చిత్రానికి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి చిత్రబృందం కలిసి వచ్చాం. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై చిత్ర నిర్మాణం జరుగుతోంది.. రాజశ్యామల అమ్మవారు కొలువుదీరిన ఆలయం విశాఖ శారదాపీఠంలోనే ఉన్నందున అమ్మవారి అనుగ్రహం కోసం ఇక్కడకు వచ్చాం. ఈ ఏడాది జూన్‌ నెలలో షూటింగ్‌ ప్రారంభించాం, త్వరలో చిత్ర నిర్మాణం పూర్తవుతుంది. ‘మహేంద్రగిరి వారాహి’ చిత్ర ఇతివృత్తాన్ని స్వరూపానందేంద్ర స్వామికి వివరించి ఆశీస్సులు అందుకున్నామని అన్నారు.