సుమంత్ మహేంద్రగిరి వారాహి గ్లిమ్స్ ను విడుదల చేసిన డైరెక్టర్ క్రిష్ !!!

రాజశ్యామల బ్యానర్‌పై తెరకెక్కుతున్న ప్రొడక్షన్‌ నెంబరు – 2 సినిమాకు మహేంద్రగిరి వారాహి టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్ర గ్లిమ్స్ ను ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేశారు అలాగే గ్రిమ్స్ ఆసక్తికరంగా ఉందని తన ట్విట్టర్ ఖాతాలో టాలెంటెడ్ యాక్టర్ విశ్వక్ సేన్ పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా దర్శకులు క్రిష్ మాట్లాడుతూ…”మహేంద్రగిరి వారాహి టైటిల్ బాగుంది, అందరికి కనెక్ట్ అయ్యే కథ కథనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్ర గ్లిమ్స్ అద్భుతంగా ఉంది. సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని ఆశిస్తున్నాను, చిత్ర యూనిట్ సభ్యులందరికి అభినందనలు తెలుపుతున్నాను” అన్నారు.

మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కధాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర దర్శకులు జాగర్లపూడి సంతోష్ తెలిపారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై చిత్ర నిర్మాణం జరుగుతోందని, త్వరలో చిత్ర నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.

సుమంత్ , మీనాక్షి గోసామి, వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, సత్యసాయి శ్రీనివాస్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు, కాలిపు మధు, ఎం. సుబ్బారెడ్డి నిర్మాతలుగా ఉన్న ఈ సినిమాకు కథ మురళి రచన , దర్శకత్వం సంతోష్ జాగర్లపూడి.

MAHENDRAGIRI VARAHI First Glimpse | Sumanth | Meenakshi | Santhossh Jagarlapudi | Anup Rubens