దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా ‘ఉత్సవం’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల

దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఇంపాక్ట్ ఫుల్ తెలుగు డ్రామా ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ని విడుద‌ల చేశారు మేక‌ర్స్.

హీరో పాత్ర పోషించిన దిలీప్ ప్రకాష్ ఒక చేతిలో నటరాజ విగ్రహం, మరో చేతిలో కిరీటం పట్టుకుని నేలపై కూర్చున్నట్లు కనిపించారు. తనచుట్టూ నాటక ప్రదర్శనలో వాడే వస్తువులు వున్నాయి. అతని ముఖంలోని చిరునవ్వు కళ పట్ల అతని అభిరుచి, ఉత్సాహాన్ని సూచిస్తుంది. ఫస్ట్ లుక్ ఆహ్లాదకరంగా ఉంది. పాజిటివ్ ఇంపాక్ట్ ని కలిగించింది. ది షో మస్ట్ గో ఆన్ అనే క్యాప్షన్ ప్లాట్‌లైన్ గురించి తెలియజేస్తుంది. ఉత్సవం మేకర్స్ టీజర్‌ డేట్ ని అనౌన్స్ చేశారు. ది రిహార్సల్ ఆఫ్ ‘ఉత్సవం’ జనవరి 28న ఉదయం 11:34కి లాంచ్ కానుంది.

‘ఉత్సవం’ లవ్, ఎమోషన్స్, భావోద్వేగాలు వినోదంతో కూడిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందులో నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌.

తారాగణం: దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా, ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: అర్జున్ సాయి
నిర్మాత: సురేష్ పాటిల్
సమర్పణ: హార్న్‌బిల్ పిక్చర్స్
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: వనమాలి, భాస్కరభట్ల, అనంత శ్రీరామ్.
గాయకులు: అనురాగ్ కులకర్ణి, కైలాష్ ఖేర్, అర్మాన్ మాలిక్, విజయ్ ప్రకాష్, పెంచల్ దాస్/ రామ్ మిరియాల.
ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
డీవోపీ: రసూల్ ఎల్లోర్
డిఐ & సౌండ్ మిక్స్: అన్నపూర్ణ స్టూడియోస్
పీఆర్వో: వంశీ & శేఖర్
మ్యూజిక్ లేబుల్: లహరి మ్యూజిక్