చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్ లో శ్రీమతి సునిత సమర్పణలో అజయ్ శ్రీనివాస్ నిర్మించిన సినిమా సిఎస్ఐ సనాతన్. ఆది సాయికుమార్, మిషా నారంగ్, నందినీ రాయ్, వాసంతి, తారక్ పొన్నప్ప, అలీ రెజా, ఖయ్యూమ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ శుక్రవారం విడుదల కాబోతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
ఈ సందర్భంగా నిర్మాత డిఎస్ రావు మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి సినిమాలు ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. శాంతయ్య గారు కథలను నమ్మే వ్యక్తి. నేను నిర్మించిన సినిమాలకు కథల విషయంలో సలహాలు ఇచ్చేవాడు. ఇప్పుడు ప్రేక్షకుల ట్రెండ్ మారింది. హీరోలను బట్టి కాక కంటెంట్ కే ఓటు వేస్తున్నారు. ఆ కంటెంట్ ట్రైలర్ లోనే చూపించగలిగితే ఖచ్చితంగా థియేటర్ వరకూ వస్తారు. సోషల్ మీడియాలో కూడా ప్రమోషన్స్ చేసుకోవాలి. టివిల కంటే ఇప్పుడు సోషల్ మీడియాలోనే ఎక్కువ ప్రమోషన్స్ వస్తున్నాయి. ఈ ట్రైలర్ లో సత్తా ఉంది. ఇండస్ట్రీలో కూడా ఈ మూవీ ట్రైలర్ పై ఓ పాజిటివ్ డిస్కషన్స్ జరుతున్నాయి. ఖచ్చితంగా ప్రేక్షకులు థియేటర్ కు వస్తారు అని నమ్ముతున్నాను. ఇక ఆది సాయికుమార్ చాలా టాలెంట్ ఉన్న హీరో. నేను గతంలో ఆయనతో సినిమా చేసేందుకు ప్రయత్నించాను. త్వరలోనే సాధ్యం అవుతుందనునుకుంటున్నాను. ఈ సినిమాలో నటించిన అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నాను. మా శాంతయ్యగారి అబ్బాయి అజయ్ శ్రీనివాస్ సాఫ్ట్ వేర్ రంగం నుంచి నిర్మాతగా వస్తున్నాడు. సినిమాపై అతని తపన చూస్తోంటే ఖచ్చితంగా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను..’ అన్నారు.
నిర్మాత అజయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘ఆది అన్నకు ఈ కథ చెప్పగానే ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు. ఆయన ఎగ్జైట్మెంట్ చూసిన తర్వాత కథపై దర్శకుడు దేవ్ తో కలిసి ఇంకా హార్డ్ వర్క్ చేశాం. ఈ కథకు సంబంధించి ప్రతి డీటెయిలింగ్ కోసం స్టడీ చేశాం. మా కెమెరామేన్ శేఖర్ వర్క్ సినిమా చాలా పెద్ద ప్లస్ అవుతుంది. ఆర్ఆర్ సినిమాకే హైలెట్ గా నిలవబోతోంది. ఈ సినిమాపై నమ్మకంతో థియేటర్ కు వచ్చే ఆడియన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ డిజప్పాయింట్ కారు అని ఖచ్చితంగా చెప్పగలను..’ అన్నారు.
నటి వాసంతి మాట్లాడుతూ .. ‘మార్చి 10న విడుదల కాబోతోన్న మా మూవీ టీమ్ మొత్తానికి ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు. ఈ చిత్రంలో నేను ఓ కీలకమైన పాత్రలో నటించాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతున్నాను.. ’అన్నారు.
యాంకర్ కమ్ యాక్టర్ రోజా .. ‘నేను ఈ సినిమాలో ఓ పాత్ర చేశాను. ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతున్నాను. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ట్రైలర్ తోనే హండ్రెడ్ పర్సెంటె క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఈ మూవీకి ఆది గారికి, నిర్మాతలకు పెద్ద విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ చెబుతున్నాను.. ’ అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కుమార్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నటించిన వారిలో చాలామంది కొలీగ్స్, ఫ్రెండ్స్ ఉన్నారు. సినిమా చూసి ఆ ఎక్స పీరియన్స్ ను షేర్ చేసుకోవడం నా ప్రొఫెషన్ లో భాగం. సినిమా తీసే ఎక్స్ పీరియన్స్ ను నాకు అందించిన మొదటి సినిమా సిఎస్ఐ సనాతన్. అందుకే ఇది నాకు స్పెషల్ మూవీ కూడా. స్క్రిప్ట్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకూ ప్రతి క్రాఫ్ట్ నూ పర్సనల్ గా ఎక్స్ పీరియన్స్ చేసే అవకాశం నాకు వచ్చింది. ఈ అవకాశం నాకు ఇచ్చిన చాగంటి ప్రొడక్షన్స్ శాంతయ్యగారికి థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమాతో మీరు ఓ కొత్త ఆది సాయికుమార్ ను చూడబోతున్నారు. ఇప్పటి వరకూ ఆయన చేసిన పాత్రలకు భిన్నంగా ఈ మూవీలో సినిమా అంతా ఒకే మూడ్ లో కనిపించబోతున్నారు. రీసెంట్ గా పులి మేక సిరీస్ తో పెద్ద విజయం అందుకున్న ఆది గారికి ఈ మూవీ మరో పెద్ద విజయం ఇస్తుందనుకుంటున్నారు. చాలా సీరియస్ రోల్ ను మరింత ఇంటెన్సిటీతో చేశారు. ఈ మూవీతో కొత్త ఫేజ్ స్టార్ట్ అవుతుందని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టూ ఎంటైర్ టీమ్..’ అన్నారు.
మరో నటుడు శివ కార్తిక్ మాట్లాడుతూ .. ‘ఆచార్య, అఖండ తర్వాత నాకు ఇది ఓ పెక్యులర్ రోల్. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెక్యులర్ సిట్యుయేషన్ ను ఫేస్ చేసి ఉంటారు. దాని వల్ల వారి జీవితాల్లో ఎలాంటి హాని జరుగుతుందనేది అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్. ఇలాంటి మంచి రోల్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతూ.. మార్చి 10న విడుదల కాబోతోన్న ఈ మూవీని ప్రతి ఒక్కరూ చూడాలని కోరుకుంటున్నాను.. ’
నటుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ‘నాకు ఈ అవకాశం రావడానికి కారణమైన కుమార్ కు థ్యాంక్స్ చెబుతున్నాను. ఫోరెన్సిక్ డాక్టర్ పాత్రలో నేను కనిపిస్తాను. దానికి అర్థం ఏంటీ అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ మూవీ ట్రైలర్ చాలా బావుంది. ఆదిగారు కొత్తగా బావున్నారు. సబ్జెక్ట్ అందరకీ నచ్చుతుంది. పులి మేక తర్వాత ఆది గారికి ఈ మూవీ మరింత పెద్ద విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను..’అన్నారు.
దర్శకుడు శివశంకర్ దేవ్ మాట్లాడుతూ.. ‘ఈ కథ చెప్పినప్పుడు హీరో ఆదిగారుతో పాటు నిర్మాతలు కూడా చాలా బాగా ఎగ్జైట్ అయ్యారు. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కథ రాసుకోవడం జరిగింది. ఇప్పటికే మన దేశంలో ఇలాంటివి చాలా జరుతున్నాయి. ఈ కథ ద్వారా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూస్తున్నారు అనే కోణం చూపించబోతున్నాము. అందువల్ల ఈ కథ మీ అందరికీ కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నారు. చూసిన ఎవరూ డిజప్పాయింట్ కారు అని నమ్మకం చెప్పగలను. ఈ మూవీకి సంబంధించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెబుతున్నాను..’అన్నారు.
హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం. ముందుగా హ్యాపీ హోళీ. పాపతో కలిసి హోళీ సెలబ్రేట్ చేసుకున్నాను. అలాగే అందరికీ విమెన్స్ డే శుభాకాంక్షలు చెబుతున్నాను. ఓ యేడాదిన్నర క్రితం దేవ్ నాకు ఈ కథ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మామూలుగా ఇలాంటి కథలు మళయాలంలో చూస్తుంటాం. ఒక మంచి పాయింట్ తీసుకుని కంప్లీట్ గా దానిమీదే రన్ అయ్యే ఓ మంచి కంటెంట్ ఇది. తెలుగులో ఓ క్రైమ్ సీన్ పై ఖచ్చితంగా ఓ పాయింట్ చుట్టూ తిరిగే కథ తెలుగులో సిఎస్ఐ సనాతన్ మొదటిది అనుకుంటున్నాను. ఇది నన్ను బాగా ఎగ్జైట్ చేసింది. అదే టైమ్ లో ప్రతి కామన్ మేన్ కనెక్ట్ అయ్యే కథ ఇది. ఫైనాన్సియల్ క్రైమ్ చుట్టూ తిరుగుతుంది. సీన్ బై సీన్ బిల్డ్ అవుతుంది. దర్శకుడు చాలా డీటెయిల్డ్ గా ఈ కథను చెప్పాడు. ఈ మూవీ దేవ్ కు మంచి హిట్ ఇవ్వాలని.. అలాగే మా నిర్మాత శ్రీనివాస్ గారికి పెద్ద బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా కో యాక్టర్స్ తో పాటు టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెబుతున్నాను. తారక్ పొన్నప్ప చాలామంచి పాత్ర చేశాడు ఈ మూవీలో. అలీ రెజా పాత్రా బావుంటుంది. ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తారు. మా సిఎస్ఐ సనాతన్ సినిమా మీ అందరినీ మెప్పిస్తుందని నమ్ముతున్నాను. ఇదే సందర్భంలో మా పులి మేక సినిమానూ విజయవంతం చేసిన ఓటిటి ప్రేక్షకులను థ్యాంక్స్ చెబుతున్నాను. అలాగే ఈ సినిమాను కూడా పెద్ద విజయం చేస్తారని నమ్ముతూ.. ఈ 10న థియేటర్స్ లో వస్తోన్న సిఎస్ఐ సనాతన్ ను మీ అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను..’ అన్నారు..
నటీనటులు – ఆదిసాయికుమార్, మిషా నారంగ్, అలీ రెజా, రోజా, నందిని రాయ్, తాకర్ పొన్నప్ప ,మధు సూదన్, వాసంతి తదితరులు.
సాంకేతిక వర్గం –
సినిమాటోగ్రఫీ: జి. శేఖర్
మ్యూజిక్: అనీష్ సోలోమాన్
పిఆర్ఒ. జి.ఎస్.కె మీడియా
నిర్మాత: అజయ్ శ్రీనివాస్
దర్శకుడు: శివశంకర్ దేవ్