Srinivasa Mangapuram : సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు జయ కృష్ణ ఘట్టమనేని రస్టిక్ ఇంటెన్స్ లవ్ స్టొరీ ‘శ్రీనివాస మంగాపురం’ తో హీరోగా లాంచ్ అవుతున్నారు. విజనరీ ఫిల్మ్ మేకర్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను వైజయంతి మూవీస్ అశ్విని దత్ సమర్పిస్తున్నారు. చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌కు అన్ని వర్గాల నుండి అద్భుతమైన స్పందన లభించింది. టైటిల్ ట్రేడ్ వర్గాలలో, ప్రేక్షకులలో భారీ బజ్‌ను సృష్టించింది. చిత్ర బృందం ఇప్పుడు 30 రోజుల పాటు సాగిన మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసింది. ఈ షెడ్యూల్‌లో 30% చిత్రీకరణ పూర్తయింది. ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్‌తో చిత్ర బృందం చాలా హ్యాపీగా ఉంది.
ఈ షెడ్యూల్‌లో చిత్ర బృందం మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో కీలక సన్నివేశాలు, అద్భుతమైన పాటలు, ముఖ్యమైన టాకీ పార్ట్‌ను చిత్రీకరించింది. పూర్తి ఉత్సాహంతో వున్న చిత్ర బృందం త్వరలో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

ఈ చిత్రానికి జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. తదుపరి షెడ్యూల్ సంక్రాంతి తర్వాత ప్రారంభం కానుంది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు మేకర్స్.
తారాగణం: జయ కృష్ణ ఘట్టమనేని, రాషా తడాని
సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: అజయ్ భూపతి
సమర్పణ: అశ్విని దత్
నిర్మాత: పి. కిరణ్
బ్యానర్: చందమామ కథలు
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
పీఆర్వో: వంశీ-శేఖర్

