ఢీలోకి రీఎంట్రీ ఇచ్చిన పూర్ణ… వామ్మో మళ్ళీ మొదలెట్టేసిందిగా…?

సౌత్ ఇండియన్ హీరోయిన్ పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, మలయాళం వంటి భాషలలో ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు పొందింది. కొంతకాలము ఇండస్ట్రీకి దూరంగా ఉన్న పూర్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాలలో ప్రధానపాత్రలో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. అంతే కాకుండా తన సెకండ్ ఇన్నింగ్స్ లో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోస్ లో పాల్గొంటూ సందడి చేస్తోంది. ఇక ఢీ షో లో జడ్జ్ గా వ్యవహరిస్తూ బుల్లితెర మీద బాగా పాపులర్ అయ్యింది. ఈ షో లో పూర్ణ చేసే సందడి అంతా ఇంతా కాదు మరి.

ఢీ షో లో జడ్జ్ గా వ్యవహరిస్తున్న పూర్ణ బాగా పెర్ఫామ్ చేసిన వారిని దగ్గరకు పిలచి ముద్దులు పెట్టడం,బుగ్గ కొరకటం వంటివి చేస్తూ బాగా ఫేమస్ అయ్యింది. అయితే గత కొంతకాలంగా పూర్ణ ఢీ షో లో కనిపించటం లేదు. అయితే ఢీ షో కి కొంత కాలం దూరంగా ఉన్న పూర్ణ మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఈవారం ప్రసారం కాబోయే డీ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో పూర్ణ రీఎంట్రీ అని వెల్లడించారు. అంతే కాకుండా పూర్ణ ఈ ఎపిసోడ్ లో ముందు లాగే బుగ్గ కొరుకుతు, ముద్దులు పెడుతూ రెచ్చిపోయింది. ఈ ఎపిసోడ్ లో పూర్ణ ఒక మేల్ డాన్సర్ తో ముద్దు పెట్టించుకుంది.

ఈ ఎపిసోడ్ లో ఒక మేల్ డాన్సర్ డాన్సు కి ఫిదా అయిన పూర్ణ తన వద్దకు రప్పించుకుని మరీ ముద్దు పెట్టించుకుంది. దీంతో హైపర్‌ ఆది, అఖిల్‌ తో పాటు అక్కడున్నవారందరు షాక్ అయ్యారు. అంతే కాకుండా మరొక లేడీ డాన్సర్ తన అద్భుతమైన డాన్స్ తో ఫుల్ సందడి చేసింది. దీంతో ఆమె డాన్స్ చూసిన తన డాన్స్ నచ్చటంతో దగ్గరకు పిలిపించి మరి బుగ్గ కొరికింది. దీంతో మళ్లీ అందరూ షాక్ అయ్యారు. ఇలా పూర్ణ ఢీ షో లో రీఎంట్రీ ఇచ్చిన మొదటి రోజే ఇలా ముద్దులు పెడుతూ, బుగ్గ కొరుకుతూ రెచ్చిపోయింది. ఇటీవలి విడుదలయిన ఢీ షో ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది.