హనీమూన్ బాగా జరిగిందా… అందరి ముందు పూర్ణ పరువు తీసిన ఆది?

వెండితెరపై నటిగా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూర్ణ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి పూర్ణ జడ్జిగా వచ్చారు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి తీస్ మార్ ఖాన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆది సాయికుమార్ పాయల్ రాజ్ పుత్ వచ్చారు.ఈ క్రమంలోనే హైపర్ ఆది ఎప్పటిలాగే వీరితో సరదాగా ముచ్చటిస్తూ సందడి చేశారు.

ఈ సందర్భంగా హైపర్ ఆది హీరో ఆది సాయికుమార్ తో మాట్లాడుతూ ఉండగా మధ్యలో పూర్ణ జోక్యం చేసుకున్నారు. పూర్ణ మాట్లాడుతూ హైపర్ ఆది ఫ్లర్ట్ చేస్తారు, హీరో ఆది క్వైట్ గా ఉంటారు అంటూ కామెంట్ చేశారు. ఈ విధంగా ఈమె కామెంట్ చేయడంతో వెంటనే హైపర్ ఆది తనదైన శైలిలో పూర్ణ పై సెటైర్ వేశారు. పూర్ణ గారు మీ హనీమూన్ బాగా జరిగిందా అంటూ ప్రశ్నించారు. ఇలా సంబంధం లేకుండా హైపర్ ఆది తనని హనీమూన్ గురించి ప్రశ్నించడంతో ఒక్కసారిగా పూర్ణ సిగ్గుతో తలదించుకుంది.

ఈ క్రమంలోనే హైపర్ ఆది చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఎంతోమంది నేటిజన్ లు పెళ్లి కాకుండానే హనీమూన్ బాగా జరిగిందా అని ఎలా అడుగుతారు అంటూ ఆది వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఆది సమయం సందర్భం లేకుండా తనకు అవకాశం వస్తే ఇతరులపై సెటైర్లు వేయడానికి ముందు ఉంటారని మరోసారి నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో వైరల్ అవుతుంది. ఇకపోతే పూర్ణ గత కొద్ది రోజుల క్రితం ప్రముఖ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరుపుకున్న విషయం మనకు తెలిసిందే త్వరలోనే వీరిద్దరూ పెళ్లి తేదీని కూడా ప్రకటించనున్నారు.