8 Vasantalu: అనంతిక సనీల్‌కుమార్‌ ‘8 వసంతాలు’ హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

ఫస్ట్ టీజర్‌తో ఒక సంచలనం సృష్టించిన తర్వాత’ 8 వసంతాలు’ చిత్ర నిర్మాతలు ఇప్పుడు సెకండ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్ మంచి ఎమోషనల్ ఎక్స్ పీరియన్స్ అందించింది. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. అనంతిక సనీల్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించారు.

టీజర్ విజువల్ గా కవితాత్మక సన్నివేశంతో ప్రారంభమవుతుంది. వర్షంలో తడిసిన అనంతిక, ఊటీకి వచ్చిన కొత్త తెలుగు రచయిత సంజయ్‌ను గమనిస్తుంది. “అతను పదాలని ప్రేమతో రాస్తే తడిసిన గులాబీ పువ్వుల్లా వుంటాయి. అదే కసితో రాస్తే పిన్ తీసిన గ్రెనేడ్‌ లా ఉంటాయి’అనే వాయిస్ సంజయ్ పాత్రని అద్భుతంగా ప్రజెంట్ చేసింది.

“అమ్మాయిలకి కత్తి పట్టుకుని రౌద్ర రసం చూపేవాడు కంటే.. కన్నీళ్లు తుడుస్తూ కరుణ రసం చూపించేవాడు అంటేనే ఇష్టం” అనే డైలాగ్ యూనివర్సల్ గా కనెక్ట్ అవుతోంది. “ప్రేమ చేరుకోవడానికి ఒక గమ్యం కాదు, మనం చేయాల్సిన ప్రయాణం” అనే హార్ట్ టచ్చింగ్ లైన్ తో టీజర్ ముగుస్తుంది. ఇది సినిమా ఎమోషనల్ డెప్త్ ని తెలియజేస్తోంది.

విజువల్ గా, ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లా వుంది. విశ్వనాథ్ రెడ్డి అద్భుతమైన సినిమాటోగ్రఫీ, హేషమ్ అబ్దుల్ వహాబ్ మనసుని కదిలించే స్కోర్‌తో ఫణీంద్ర నర్సెట్టి అద్భుతమైన సంభాషణలు ప్రాణం పోసుకున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు ఫస్ట్ క్లాస్.

అరవింద్ మూలే ప్రొడక్షన్ డిజైన్ సినిమా లీనమయ్యే అనుభూతిని పంచాయి. శశాంక్ మాలి ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా, బాబాసాయి కుమార్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

అనంతిక సనిల్‌కుమార్ అద్భుతంగా కనిపించారు. తన పెర్ఫార్మెన్స్ హార్ట్ టచ్చింగ్ గా వుంది.

అద్భుతమైన కథనంతో, 8 వసంతాలు ఈ మాన్సూన్ లో పర్ఫెక్ట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది. ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది.

తారాగణం: అనంతిక సనిల్‌కుమార్, హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బాప్రగడ, సమీరా కిషోర్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: ఫణీంద్ర నర్సెట్టి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
CEO: చెర్రీ
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
డీఓపీ: విశ్వనాథ్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మ్యూల్
ఎడిటర్: శశాంక్ మాలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబాసాయి కుమార్ మామిడిపల్లి
యాక్షన్ కొరియోగ్రఫీ: వింగ్ చున్ అంజి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Public Reaction On YCP Vennupotu Dinam || Ap Public Talk || Chandrababu || Ys Jagan || Telugu Rajyam